Nukaraju:బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తుంది. అయితే దశబ్దన్నర కాలం పాటు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth)కామెడీ షో ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలాంటి వారిలో కమెడియన్ నూకరాజు(Nukaraju) కూడా ఒకరు. నూకరాజు ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఈయన పెద్ద ఎత్తున యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నూకరాజు ఆసియా (Asiya)అనే అమ్మాయిని ప్రేమించిన విషయం తెలిసిందే.
పెళ్లి గురించి ఆలోచనే లేదా?
ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం తమ కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కానీ ఇప్పటివరకు పెళ్లి గురించి మాత్రం ఎక్కడా స్పందించలేదు. సాధారణంగా ప్రేమలో ఉన్న సెలెబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడం అనేది సర్వసాధారణం. అయితే ఆసియా నూకరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిద్దరి పెళ్లి(Wedding) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా పెళ్లి గురించి నూకరాజు చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి…
మనం మన జీవితంలో ఏదైనా నెరవేరాలి అంటే ఎంతో కష్టపడి పని చేసుకుంటేనే అనుకున్న లక్ష్యానికి చేరుతాము. కానీ మనం పెళ్లి చేసుకోవాలన్న లేదా ఇల్లు కట్టుకోవాలనే ఎన్ని ప్రయత్నాలు చేసిన కాలం కలిసి వచ్చేవరకు అవి జరగవు. “కక్కు వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదంటారు కదా”.. అలాగే మేం పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కుదరదని సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటూ సమాధానం చెప్పారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్లాన్ చేసిన ఏదీ కుదరదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే కుదురుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా వీరిద్దరూ పెళ్లి గురించి చేస్తున్న ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచనలో లేరని స్పష్టమవుతుంది.
ప్లాన్ చేస్తే ఏది కుదరదు..
పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తామని చెప్పకనే చెప్పారు. నూకరాజు ఆసియా ఇద్దరు కూడా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మరింత ఉన్నత స్థానంలో ఉండటం కోసం ఎంతో కష్టపడుతున్నారు. బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులు అందరిని నవ్విస్తూ సందడి చేస్తున్న వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ లో కూడా పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలను చేశారు వీటికి చాలా మంచి ఆదరణ లభిస్తుంది తాజాగా “తాటి బెల్లం” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీడియో సాంగ్ మాత్రం ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఇలా కెరియర్లో మరింత సక్సెస్ అందుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.
Also Read: Nukaraju – Asiya: నేను అలాగే డ్రెస్ చేసుకోవాలని నూకరాజు కండిషన్స్ పెట్టేవాడు.. అసియా కామెంట్స్