BigTV English

Ind vs Aus: అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత్.. పూర్తి వివరాలు ఇవే

Ind vs Aus: అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత్.. పూర్తి వివరాలు ఇవే

Ind vs Aus: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న సమయంలో.. ఆస్ట్రేలియా 2025 – 26 సీజన్ కి సంబంధించింది తన దేశీయ అంతర్జాతీయ షెడ్యూల్ ని ప్రకటించింది. 2026 టీ – 20 ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టి-20 మ్యాచ్ లలో తలపడబోతుంది భారత్.


Also Read: HCA: SRH యాజమాన్యంతో గొడవలు… క్లారిటీ ఇచ్చిన HCA!

ఆస్ట్రేలియా 2025 – 26 సీజన్ కోసం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఆస్ట్రేలియా – టీమిండియా జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్లు జరుగుతాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇవి 8 వేరు వేరు వేదికలలో జరుగుతాయి. దీంతో పాటు ఆస్ట్రేలియా ఆగస్టులో దక్షిణాఫ్రికా తో వైట్ బాల్ సిరీస్ ని కూడా ఆడబోతోంది. ఇందులో మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు ఉన్నాయి.


ఇక భారత్ తో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 19 నుండి నవంబర్ 8 వరకు.. 21 రోజుల్లో భారత జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడబోతోంది. వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లు, దీని తరువాత టి-20 సిరీస్ లో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఐదు టి-20ల్లో ఆస్ట్రేలియా ని భారత్ ఢీకొట్టనుంది. ఈ సిరీస్ వచ్చే సంవత్సరం భారత్, శ్రీలంకలో జరగనున్న టి-20 వరల్డ్ కప్ కి సరైన సన్నాహక మ్యాచ్ లుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సిరీస్ కి ముందు మూడు వన్డేల్లో ఆస్ట్రేలియాని భారత్ ఢీకొట్టనుంది.

ఆస్ట్రేలియా – భారత్ వన్డే సిరీస్ షెడ్యూల్:
1 వన్డే – అక్టోబర్ 19 {పెర్త్ స్టేడియం}
2 వన్డే – అక్టోబర్ 23 {అడిలైడ్ ఓవల్}
3 వన్డే – అక్టోబర్ 25 {సిడ్నీ క్రికెట్ గ్రౌండ్}

టి-20 సిరీస్ షెడ్యూల్:
1 టి-20 – అక్టోబర్ 28 {మనుకా ఓవల్}
2 టీ-20 – అక్టోబర్ 31 {ఎంసీజీ}
3 టీ-20 – నవంబర్ 2 {హుబర్ట్}
4 టీ-20 – నవంబర్ 6 {గోల్డ్ కోస్ట్}
5 టీ-20 – నవంబర్ 8 {బ్రిస్బెన్}

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?

అలాగే వచ్చే సంవత్సరం ప్రారంభంలో భారత మహిళా జట్టు సైతం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో భారత్ మూడు టీ-20 లు, మూడు వన్డేలు, ఒక టెస్ట్ ఆడనుంది. 2026 ఫిబ్రవరి 15, 19, 21 తేదీలలో టి-20 సిరీస్ మ్యాచ్ లు జరగనుండగా.. ఫిబ్రవరి 24, 27, మార్చి 1న వన్డే సిరీస్ మ్యాచ్లు ఆడనుంది. మార్చ్ 6 నుండి 9వ తేదీ వరకు పెర్త్ వేదికగా టెస్ట్ మ్యాచ్ లో తలపడనుంది. అయితే ఈ క్రమంలో వన్డే సిరీస్, టి-20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. మరి ఈ టూర్ లో భారత్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Aussie Men’s Cricket Team (@ausmencricket)

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×