Big Stories

IND vs AUS: నాలుగో టెస్ట్ డ్రా.. సిరీస్ భారత్ కైవసం..

IND vs AUS: అహ్మదాబాద్ టెస్టులో చివరి రోజు అద్భుతం ఏమి జరగలేదు. పిచ్ బ్యాటింగ్ కే అనుకూలంగా ఉండటంతో భారత్ స్పిన్నర్లు తిప్పలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎదురొడ్డి నిలబడ్డారు. దీంతో భారత్ -ఆస్ట్రేలియా నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 3/0తో ఐదో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా తొలుత మథ్యూ కునెమన్ (6) వికెట్ ను 14 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ వికెట్ల మధ్య పాతుకుపోయారు. రెండో వికెట్ కు 139 జోడించిన తర్వాత హెడ్ (90) సెంచరీని చేజార్చుకుని అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లబుషేన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరికి ఆస్ట్రేలియా 173 పరుగులు చేసింది. దీంతో టెస్టు డ్రాగా ముగిసింది.

- Advertisement -

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా ( 180), కామెరూన్ గ్రీన్ ( 114) సెంచరీలతో కదం తొక్కారు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 6 వికెట్లు, షమీ 2, జడేజా, అక్షర్ తలో వికెట్ తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (128), విరాట్ కోహ్లీ (186) సెంచరీలతో చెలరేగారు. అక్షర్ పటేల్ (78) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 91 పరుగుల లీడ్ వచ్చింది. నాథన్ లయన్ , టాడ్ మర్ఫీ తలో 3 వికెట్లు తీయగా..స్టార్క్ , కునెమన్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముసిగింది. తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్ గెలిచింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిని టీమిండియా అందుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News