Ind vs Eng T20: భారత క్రికెట్ జట్టు మరో సిరీస్ కోసం సిద్ధమైంది. 5 మ్యాచ్ ల టి-20 సిరీస్ లో భాగంగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ-20 నేటి నుండే ప్రారంభం కాబోతోంది. ఈ టి-20 సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుని ఓడించేందుకు సిద్ధం అవుతుంది టీమ్ ఇండియా. సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమ్ ఇండియా జట్టు బరిలోకి దిగనుంది. మొదటి టీ-20 లో గెలిచి శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
Also Read: Mohammed Siraj: టోలిచౌకికి కొత్త రేంజ్ రోవర్ తో వచ్చిన సిరాజ్ !
2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కి దూరమైన సీనియర్ స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షమీ అనుభవం ఈ మ్యాచ్ లో కీలకం కానుంది. మరోవైపు వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ కి కూడా జట్టులో స్థానం లభించింది. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఈ టి-20 లో చోటు లభించింది. ఇంగ్లాండ్ జట్టుకు జాస్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
నేడు కలకత్తాలో జరగనున్న ఈ తొలి మ్యాచ్ కి ఇంగ్లాండ్ కూడా ఇప్పటికే జట్టును ప్రకటించింది. పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ ఏడాది తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇతడు 2023 డిసెంబర్ లో చివరిసారి వెస్టిండీస్ తో ఆడాడు. మరోవైపు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ ని ఎంపిక చేసింది ఇంగ్లాండ్. లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్ లో స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. అలాగే బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ కలిసి ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తారు.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ టి – 20 మ్యాచ్ జరగబోతోంది. ఈ వేదికపై చివరిసారిగా వెస్టిండీస్ – భారత్ 2022 ఫిబ్రవరి 20న తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
నేడు జరగబోయే తొలి టి-20 మ్యాచ్ ఎలా చూడాలంటే.. ఈ తొలి టి-20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ మ్యాచ్ ప్రసార హక్కులను దక్కించుకుంది. తొలి టి-20 మ్యాచ్ ఈ ఛానల్ లో ప్రసారం కానుంది. అలాగే ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లేదా వెబ్ సైట్ లో వీక్షించవచ్చు.
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (C), సంజు శాంసన్ (wk), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (vc), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (wk).
Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్