BigTV English

Mohammed Siraj: టోలిచౌకికి కొత్త రేంజ్ రోవర్ తో వచ్చిన సిరాజ్ !

Mohammed Siraj: టోలిచౌకికి కొత్త రేంజ్ రోవర్ తో వచ్చిన సిరాజ్ !

Mohammed Siraj:  టీమిండియా స్టార్ ఆటగాడు మహమ్మద్ సిరాజు ( Mohammed Siraj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అలాగే రంజిలో రాణించిన మహమ్మద్ సిరాజు… ఏకంగా టీమిండియాలోకి వచ్చాడు. టీమిండియాలోకి వచ్చిన తర్వాత… ప్రత్యర్ధులకు హైదరాబాద్  ( Hyderabad ) సత్తా ఏంటో చూపించాడు మహమ్మద్ సిరాజ్. అయితే అలాంటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj )… తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెరిశాడు.


 

హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని టోలి చౌక్ ఆర్టీవో ఆఫీస్ కు… తాజాగా మహమ్మద్ సిరాజ్ వచ్చారు. మంగళవారం సాయంత్రం రోజున… తన కొత్త రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్.. నిమిత్తం… టోలిచౌక్ ఆర్టీవో ఆఫీస్ కు ( Office of RTO Tolichowk ) రావడం జరిగింది. ఇక… డీఎస్పీ మహమ్మద్ సిరాజు ఆర్టిఓ ఆఫీస్ కు రావడంతో… టోలిచౌక్ ఆర్టీవో కార్యాలయం ( Office of RTO Tolichowk ) దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అటు మహమ్మద్ సిరాజుకు ( Mohammed Siraj ) గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అధికారులు. ఆయన కారు రిజిస్ట్రేషన్… దగ్గరుండి చేయించారు. మహమ్మద్ సిరాజ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా…. కారు రిజిస్ట్రేషన్ చేయించి ఇంటికి పంపించారు.


Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

ఇది ఇలా ఉండగా… ఆర్టీవో ఆఫీస్ కు వచ్చన మహమ్మద్ సిరాజ్ ను చూసి సెల్ఫీలు అడిగారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ తో పాటు ఆర్టీవో అధికారులు కూడా మహమ్మద్ సిరాజుతో ఫోటోలు దిగారు. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా ఎగబడి మరీ సెల్ఫీలు దిగారు. ఇక ఫ్యాన్స్ సందడి చేస్తున్నప్పటికీ… ఎలాంటి ఆవేశం చూపించకుండా మహమ్మద్ సిరాజ్ కూడా… వాళ్లందరికీ సహకరించాడు. అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చాడు మన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ). దీంతో మహమ్మద్ సిరాజ్ టోలిచౌక్.. ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) అలాగే టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ నుంచి మహమ్మద్ సిరాజును తొలగించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో పెద్దగా రాణించడం లేదని మహమ్మద్ సిరాజ్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వేటు వేసింది. దీంతో హైదరాబాద్ తరఫున రంజి మ్యాచుల్లో ఆడబోతున్నాడు మహమ్మద్ సిరాజ్. ఎలాగైనా రంజిత్ ట్రోఫీలో మళ్ళీ ఫామ్ అందుకొని… టీమిండియా జెర్సీ వేసుకోవాలని మహమ్మద్ సిరాజ్ కూడా కసరత్తులు చేస్తున్నాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాణించేందుకు సిద్ధమవుతున్నాడు మహమ్మద్ సిరాజ్.

 

Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×