BigTV English

India Vs England Test Match Updates : స్వీప్, రివర్స్ స్వీప్ పై.. టీమ్ ఇండియా ఫోకస్..

India Vs England Test Match Updates : స్వీప్, రివర్స్ స్వీప్ పై.. టీమ్ ఇండియా ఫోకస్..

India Vs England Test Match Updates(Today’s sports news) :


హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఒలిపోప్ అద్భుతంగా ఆడి 196 పరుగులు చేశాడు. అందులో చాలా వరకు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లే ఉన్నాయి. దీనివల్ల అతను స్ట్రయిక్ రొటేట్ చేయడమే కాదు, వికెట్ పడకుండా కూడా కాపాడుకున్నాడు.

India Vs England Test Match Updates
India Vs England Test Match Updates

ఇతను ఒక్కడి ఆట కారణంగా ఇండియాకు విజయం దూరమైపోయింది.


స్వీప్ షాట్ ఆడటం వల్ల బాల్ నేలపై నుంచి వెళుతుంది. అందువల్ల స్పిప్పుల్లో ఐదుగురున్నా ఉపయోగం లేదు. వస్తే రన్స్ వస్తాయి. అయితే రిస్క్ కూడా ఉంటుంది. తొలి టెస్ట్‌లో 196 పరుగుల వద్ద ఒలిపోప్ కూడా ఇదే స్వీప్ షాట్ ట్రై చేసి అవుట్ అయ్యాడనే సంగతి మరువకూడదని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఇవి ఒక్కరోజులో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ అన్నాడు. అది కొన్నేళ్ల సాధన ఫలితమని అన్నాడు.

ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి బ్యాటర్లు అందరూ కూడా స్వీప్ షాట్లు, రివర్స్ స్వీప్ షాట్లు రోజంతా తెగ ప్రాక్టీస్ చేశారు. చాలామంది అనడం ఏమిటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా, ఎవరి సహజమైన ఆట, వారు ఆడుతూనే అవసరమైనప్పుడు ఆడాలని సీనియర్లు సూచిస్తున్నారు. ఆ షాట్ సెలక్షన్ సరిగా లేకపోతే అవుట్ అయిపోవడం తప్పదని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ అన్నాడు.

టీమ్ ఇండియా క్రికెటర్లు స్వీప్ షాట్లు కొట్టడంలో నిపుణులేమీ కాదని సీనియర్లు అంటున్నారు. కాకపోతే ఎందుకైనా మంచిది, ఓవర్ డిఫెన్స్‌కి పోవడం కన్నా, స్ట్రయిక్ రొటేట్ చేసేందుకైనా ఉపయోగపడుతుంది కదా.. అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయించారని చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నెట్స్‌లో బారత్ ఆటగాళ్లంతా పాల్గొన్నారు.

శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ దాదాపు అందరూ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రయత్నించారు. ముఖ్యంగా గిల్‌తో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించారు. ఎందుకంటే తను ఓవర్ డిఫెన్స్ వల్ల కూడా అవుట్ అవుతున్నాడని, అందుకనే స్వీప్ షాట్లు కొంతవరకు, వికెట్ కాపాడుకునేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఎవరైనా సరే టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే, వారిని ఆపడం ఒక పట్టానా సాధ్యం కాదని, అందుకు స్వీప్ షాట్లు ఒక ఆయుధమని అంటున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×