BigTV English

Srikar Bharat : ఫస్ట్ టెస్ట్ తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందంటే.. కేఎస్ భరత్..!

Srikar Bharat : ఫస్ట్ టెస్ట్ తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందంటే.. కేఎస్ భరత్..!

Ks bharat press conference(sports news today):


మొదటి టెస్ట్ ఓటమిపై తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ మాట్లాడాడు. విశాఖ వాసి అయిన భరత్ తన సొంత మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. ఆ సంతోషంలో  ఉన్న తను కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు.

Srikar Bharat IND Vs ENG
Srikar Bharat IND Vs ENG

తొలి టెస్ట్‌లో అశ్విన్‌తో కలిసి 8వ వికెట్‌కు అమూల్యమైన 57 పరుగులు జోడించిన కేఎస్ భరత్ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే, కచ్చితంగా టీమ్ ఇండియా విజయం సాధించేది. కానీ అనూహ్యంగా టామ్ హార్ట్‌లీ భరత్‌ని అవుట్ చేయడంతో మ్యాచ్ ఓడిపోవడం తథ్యమని తేలిపోయింది.


ఆ రోజున తొలిటెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం, నేను డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాను. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ ఓటమిని చూసి భయపడ వద్దని కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ ద్రవిడ్ చెప్పారు. వారు కొన్ని సూచనలు చేశారు. అవి కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఇది అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్, ఇలాంటివి జరుగుతుంటాయి, ఎన్నో సార్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడ్డాం,  సత్తా చాటామని వారు కొన్ని మ్యాచ్ లను ఉదహరించారు.

ఏదో జరిగిపోయిందని చెప్పి, భయపడొద్దు, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమని చెప్పారు. అయితే టీమ్ ఇండియాలో ఆటగాళ్లు అందరికి భయం అనే మాటే తెలీదని అన్నాడు. టీవీల ముందు కొన్ని కోట్ల మంది చూస్తుంటారు.  స్టేడియంలో అన్ని వేల మంది సమక్షంలో ఆడాలంటే, ఎంతో మానసిక స్థయిర్యం కావాలని తెలిపాడు.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టు ముందు కూడా రివర్స్ స్వీప్ సాధన చేశామని అన్నాడు. కానీ క్రీజులోకి వెళ్లాక బ్యాటింగ్ అప్రోచ్ అనేది బ్యాటర్ల వ్యక్తిగత నిర్ణయమని తెలిపాడు. అయితే జట్టు అవసరాలకు తగినట్టుగా ఎప్పటికప్పుడు ఆట తీరును మార్చుకొని ఆడాల్సి ఉంటుందని అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా పతనాన్ని శాసించిన ఇంగ్లాండ్ ఆరంగ్రేటం బౌలర్, ఏడు వికెట్లు తీసిన టామ్ హార్ట్ లీ గురించి మాట్లాడాడు. క్రికెట్ లో ఎవరూ కూడా బౌలర్లని ఎదుర్కోరు. వారు వేసే బంతుల్ని ఎదుర్కొంటారని తెలిపాడు. అయితే క్రికెట్ లో మంచి ప్రదర్శన చేసిన ఎవరినైనా అభినందించాల్సిందేనని అన్నాడు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×