BigTV English

Rohit Sharma : జడ్డూ.. ఇది టీ 20 అనుకో.. : రోహిత్ శర్మ

Rohit Sharma : జడ్డూ.. ఇది టీ 20 అనుకో.. : రోహిత్ శర్మ
India vs England, 3rd Test

India vs England 3rd Test (sports news today):


టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అప్పుడప్పుడు సరదాగా కామెంట్లు చేస్తుంటాడు. మ్యాచ్ లో బౌలర్లు తప్పులు చేస్తుంటే, ఒకొక్కసారి సరదాగా మందలిస్తుంటాడు. లేదంటే సీరియస్ అవుతుంటాడు. అయితే కుర్రాళ్ల విషయంలో ఒకలా ఉంటాడు, సీనియర్లతో అయితే ఫ్రెండ్ షిప్ కొద్దీ చెబుతుంటాడు. రవీంద్ర జడేజా విషయంలో వరుసగా నో బాల్స్ వేస్తుంటే, తను మందలించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. 31వ ఓవర్ జరుగుతోంది. జో రూట్ స్ట్రయికింగ్ లో ఉన్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే వరుసగా రెండు నోబాల్స్ వేశాడు. స్లిప్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ కొంచెం అసహనానికి గురయ్యాడు.


కానీ దానిని పైకి ప్రదర్శించకుండా జడేజాపై కామెంట్ చేశాడు.
‘జడ్డూ ఇది ఐపీఎల్ లో జరిగే టీ 20 మ్యాచ్ అనుకొని బాల్ వేయు.. అక్కడ నువ్వు ఇలా వేయవు కదా’ అని సరదాగా ఆటపట్టించాడు. ఎందుకంటే  ఐపీఎల్ లో గానీ ‘ నో బాల్ ’ వేస్తే, అది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది.

Read more:అశ్విన్ పై పేలుతున్న మీమ్స్..

అంతేకాదు సీరియస్ గా వార్నింగులు కూడా ఇస్తారు. పరుగులు ఎన్నిచ్చినా పర్వాలేదు గానీ, నో బాల్స్ వేస్తే మాత్రం అది చాలా కాస్ట్ లీ గా మారిపోతుందనే సంగతి తెలిసిందే. అదే టెస్టు మ్యాచ్ కి వచ్చేసరికి అంత సీరియస్ గా తీసుకోరు. అందుకే ఇదే విషయాన్ని రోహిత్ సరదాగా జడేజాకి గుర్తు చేశాడు.

ఫస్ట్ స్లిప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ మాటలు స్టంప్ మైక్ లో రికార్డయ్యాయి. దీంతో ఇవి బయటకు వచ్చి వైరల్ గా మారాయి. కాకపోతే ఇటీవల రోహిత్ శర్మ ఎమోషనల్ గా మాట్లాడుతున్నవి కూడా బయటకి వచ్చేస్తున్నాయి. వాటిల్లో ఫీల్డర్లని తిడుతున్న తిట్లు, బూతులు కూడా ఉంటున్నాయనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.

ఇది దేశం తరఫున ఆడే ఆట, అంతేకాదు 140 కోట్ల మంది అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, ఆ ఒత్తిడి ఉంటుంది, దానిని పెద్దమనసుతో అందరూ అర్థం చేసుకోవాలని కొందరంటున్నారు.

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×