E-Paper
Advertisement

Engineering Fees: ఇంజినీరింగ్ ఫీజులను ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ!

Engineering Fees: ఇంజినీరింగ్ ఫీజులను ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ!
Advertisement

Engineering Fees: స్వూచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో సీబీఐటీకి అత్యధికంగా రూ.1.83 లక్షల ఫీజును నిర్ణయించింది. లక్షకుపైగా ఫీజును 33 కాలేజీలకు నిర్ణయించగా.. 2 కాలేజీలకు రూ.లక్షగా నిర్ణయించింది. గత 2022-23 నుంచి 2024-25 బ్లాక్ పీరియడ్ లో నిర్ణయించిన ఫీజుల కంటే కొన్ని కాలేజీలకు తగ్గించగా.. మరికొన్ని కాలేజీలకు ఫీజులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కొత్తగా నిర్ణయించిన ఫీజుల ప్రకారం

టీఏఎఫ్ఆర్సీ ఇప్పటివరకు 19 కళాశాలల్లో ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గిస్తూ, 70 కళాశాలలకు ఫీజును పెంచకుండా గత ఫీజునే ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. టీఏఎఫ్ఆర్సీ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు బ్లాక్ పీరియడ్ 2025-26 నుంచి 2027-28 వరకు మూడేల్ల పాటు ఈ ఫీజులను అమలుచేయనుంది. కొత్తగా నిర్ణయించిన ఫీజుల ప్రకారం సీబీఐటీకి అత్యధికంగా రూ.1.83 లక్షలుగా నిర్ణయించగా, వాసవి కాలేజీ రూ.1.75 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు కనీస ట్యూషన్ ఫీజు రూ.45 వేలుగా నిర్ణయించగా.. 21 కాలేజీలకు మినిమం ఫీజును ఖరారు చేశారు. కొత్తగా నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 నుంచే అమలులోనికి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

Advertisement

Also Read: Romantic comedy OTT : అలాంటి పనోడికి నా కూతురు కావాలా ? ఆటో డ్రైవర్ గంతులు… ప్రియుడికి చెప్పుకోలేని కష్టాలు

ఈఏపీసెట్ కౌన్సెలింగ్..

మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్ 2025 -26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ ఫీజులు వర్తిస్తాయి. నాలుగు సంవత్సరాల పాటు ఇవే రుసుములను విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా గత ఆగస్టులో జరిగిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా విద్యార్థుల నుంచి పాత ఫీజులనే వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫీజులను నిర్ణయించిన తర్వాత ఒకవేళ తగ్గితే ఆ వ్యత్యాసాన్ని వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కౌన్సిలింగ్ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో 19 కాలేజీల్లో ఫీజు తగ్గడంతో అక్కడ సొంతంగా ఫీజు చెల్లించే వారికి ఆయా కాలేజీలు ఆ వ్యత్యాసం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: Comedy drama OTT: నలుగురు అమ్మాయిలతో కేకలు పెట్టిస్తూ… నాలుగు సీజన్లతో వచ్చిన నాటు సిరీస్

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×