India vs Pakistan: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఆదివారం రోజున కీలక పోరు జరగనుంది. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈ లీగ్ మ్యాచ్.. జరగబోతుంది. దీంతో.. ఈ మ్యాచ్ ను ఫైనల్ మ్యాచ్ తరహాలో చూస్తున్నారు. సాధారణంగా.. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే… అందరికీ ఒక ఊపు వస్తుంది. కచ్చితంగా.. మ్యాచ్ తిలకించేందుకు జనాలు ఎగబడతారు. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి.
ఒక్కో టికెట్ 4 లక్షల రూపాయల వరకు కూడా బ్లాక్ లో అమ్ముకున్నారట. అయితే… ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… ఇరుజట్ల వన్డే ట్రాక్ రికార్డ్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు పాకిస్తాన్ అలాగే టీమిండియా మధ్య 135 వన్డే మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇందులో పాకిస్తాన్ పై చేయి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ 135 వన్డే మ్యాచ్లో 73 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది.
Also Read: Indian National Anthem: పాకిస్తాన్ గడ్డపై.. ఇండియా జాతీయగీతం… గూస్ బంప్స్ రావాల్సిందే !
టీమిండియా కేవలం 57 మ్యాచ్ లలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంటే పాకిస్తాన్… టీమిండియా పై ఆదివారం రోజున గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నమెంట్లో… పాకిస్తాన్ పై టీమిండియా ఎక్కువగా గెలిచింది. ఆ రికార్డ్స్ పరిశీలిస్తే అప్పుడు టీమిండియా పై చేయి సాధిస్తుంది. కానీ ఛాంపియన్ ట్రోఫీ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే… టీమిండియా కు షాక్ తగిలేలా కనిపిస్తోంది.
ఇప్పటివరకు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదు మ్యాచ్లు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ పై చేయి సాధించింది. ఐదు మ్యాచ్లు ఆడితే టీమిండియా రెండు గెలవగా పాకిస్తాన్ 3 గెలిచి సత్తా చాటింది. అందులో 2017 ఫైనల్ కూడా ఉంది. 2004, 2009, 2013 ఛాంపియన్ ట్రోఫీలలో… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ లు జరిగాయి. చివరగా 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు దేశాలు ఫైనల్లో తలపడ్డాయి. అంతకు ముందు లీక్ దశలో కూడా పోటీ పడ్డాయి.
Also Read: PAK Team – ICC CT 2025: భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే… లెక్కలు ఇవే?
అయితే చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ వేదికగా జరిగింది. ఇందులో 50 ఓవర్లలో 339 పరుగులు చేసి… చరిత్ర సృష్టించింది పాకిస్తాన్. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 158 పరుగులకు కుప్పకూలింది టీమిండియా. దీంతో పాకిస్తాన్ ఛాంపియన్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించడం మానేశారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత అంటే 2025 సంవత్సరం లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అలాగే టీమిండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే… టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. పాకిస్తాన్ కంటే బలంగా ఉంది. కాబట్టి టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.