BigTV English
Advertisement

Allu Arjun: ఆ బాలీవుడ్ హీరోను ప్రశంసలతో ముంచెత్తిన బన్నీ.. మరి తెలుగువారి పరిస్థితి ఏంటి.?

Allu Arjun: ఆ బాలీవుడ్ హీరోను ప్రశంసలతో ముంచెత్తిన బన్నీ.. మరి తెలుగువారి పరిస్థితి ఏంటి.?

Allu Arjun: కొందరు హీరోలపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిన తర్వాత వారు ఏం మాట్లాడినా ప్రేక్షకులకు తప్పుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పరిస్థితి అలాగే ఉంది. ‘పుష్ప 2’ తర్వాత పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ రావడంతో హిందీ ఆడియన్స్‌పైకి అల్లు అర్జున్ ఫోకస్ షిఫ్ట్ అయ్యిందని చాలామంది ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో అయినా కూడా అలా ప్రవర్తించడం లేదని, పూర్తిగా బీ టౌన్ మార్కెట్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నాడని ఫీలవుతున్నారు. అలా అల్లు అర్జున్‌పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్న సమయంలోనే తను ఒక బాలీవుడ్ హీరోను ప్రశంసలతో ముంచేయడం తెలుగు ప్రేక్షకులకు మరింత కోపం వచ్చేలా చేస్తోంది.


తనపైనే ప్రశంసలు

తాజాగా ఒక హాలీవుడ్ మ్యాగజిన్.. అల్లు అర్జున్‌ (Allu Arjun)ను ఏరికోరి ఫోటోషూట్ చేసి అది కవర్ పేజ్‌గా పబ్లిష్ చేసింది. అంతే కాకుండా ఈ కవర్ షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన అంశాలు, అందులో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తను ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఏం చేయకుండా ఉంటానని బన్నీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో పాటు ‘పుష్ప 2’కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఒక బాలీవుడ్ హీరోపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు.. రణబీర్ కపూర్.


పర్ఫార్మెన్స్ అద్భుతం

ఇటీవల విడుదలయిన సినిమాల్లో తనకు బాగా ఏ సినిమా నచ్చింది అని అడగగా.. ‘యానిమల్’ (Animal) అని సమాధానమిచ్చాడు అల్లు అర్జున్. అంతే కాకుండా అందులో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘నేను ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ రేంజ్‌లో నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్‌ల పరంగా నచ్చిన సినిమా అంటే యానిమల్. అందులో అందరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ మూవీ నాకు చాలా నచ్చింది. ఇంక తెలుగులో కూడా పలు మంచి సినిమాలు వచ్చాయి’’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ‘యానిమల్’పై బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: హీరోలకు ఇచ్చేదాంట్లో 5 శాతం రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు.. భూమి బోల్డ్ కామెంట్స్

తెలుగు సినిమాలు గుర్తులేవా.?

తెలుగు దర్శకుడు తెరకెక్కించిందే అయినా ‘యానిమల్’ అనేది ఒక బాలీవుడ్ మూవీ. ఆ సినిమా గురించి, అందులో పర్ఫార్మెన్స్‌ల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన అల్లు అర్జున్.. ఒక్క తెలుగు సినిమా పేరు కూడా ప్రత్యేకంగా చెప్పలేకపోయాడు. అంటే బన్నీ ఎంతసేపు బీ టౌన్ ఆడియన్స్‌ను మాత్రమే ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడని, తెలుగువారిని పూర్తిగా మర్చిపోయాడని ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తన ఫ్యాన్స్ మాత్రం తను ఏం మాట్లాడినా కావాలనే కొందరు నెగిటివిటీ వచ్చేలా చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరితో అనే ఆందోళన కూడా ఫ్యాన్స్‌లో మొదలయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×