HHVM Making Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు (HHVM). ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం (AM Ratnam)నిర్మాణంలో.. ఈయన వారసుడు జ్యోతి కృష్ణ(Jyoti Krishna) దర్శకత్వంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఎట్టకేలకు జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటు నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam) ఇద్దరూ ఎవరికివారు తెగ కష్టపడుతున్నారు. ఇకపోతే సినిమాలో భారీ తారాగణం భాగమైంది. కానీ ప్రమోషన్స్ మాత్రం వీరిద్దరే చేస్తుండడంతో ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్స్ చేయకుండా కేవలం వీరిపైనే వదిలేస్తే ఎలా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
మేకింగ్ వీడియో వదిలిన టీం..
ఇలాంటి సమయంలో సినిమాపై అంచనాల పెంచడానికి తాజాగా మేకర్స్ హరిహర వీరమల్లు మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో టీమ్ మొత్తం బాగా కష్టపడినట్లు తెలుస్తోంది. కానీ అందుకు తగ్గట్టు ప్రమోషన్స్ కూడా జరిగితే ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించాలి అంటే అందుకు తగ్గట్టుగా చిత్ర బృందం కూడా గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని సమాచారం.
హరిహర వీరమల్లు మేకింగ్ వీడియోలో హైలెట్స్..
ఇక హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో విషయానికి వస్తే..2:54 నిమిషాల నిడివి ఉన్న మేకింగ్ వీడియోని వదులుతూ.. ఆ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో..”పులిని తినే బెబ్బులి వచ్చేరో.. దొడ్డ కళ్ళు చేసుకొని చూడరో” అనే ఒక ఫోక్ సాంగ్ ను జత చేసి మరీ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో మాస్, యాక్షన్ సీక్వెన్స్లతో పాటు నటీనటుల మధ్య కామెడీ సన్నివేశాలను చూపించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ పాటు ఆయన సెట్లో ప్రతి విషయాన్ని పరిశీలించడం మనం చూడవచ్చు. ఇక తల్వార్లతో యుద్ధం, సెట్లో నటీనటులతో ముచ్చట్లు, హీరోయిన్ సాంగ్, పైగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణ ఇలా అన్నింటిని హైలెట్ చేస్తూ ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం మొత్తం బాగానే కష్టపడినట్లు అనిపిస్తోంది. మరి ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో లేదో తెలియాలి అంటే జూలై 24 మొదటి షో ముగిసే వరకు ఎదురు చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
సినీ ఇండస్ట్రీలోకి బలవంతంగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ నేడు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నా.. ఇండియా వైడ్ పాపులారిటీ లభించింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు తరువాత సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ , హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు హరిహర వీరమల్లు2 చిత్రాలను లైన్ లో ఉంచారు.
ALSO READ:Hansika Motwani: విడాకులు తీసుకోబోతున్న హన్సిక.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన సోహెల్!