E-Paper
Advertisement

Ind vs SA 3rd T20I: నేడు మూడో టీ20…ఆ ఇద్ద‌రిపై సూర్య వేటు, గిల్ వ‌ల్లే మ‌రొక‌రు బ‌లి..ఫ్రీగా మ్యాచ్ చూడాలంటే

Ind vs SA 3rd T20I:  నేడు మూడో టీ20…ఆ ఇద్ద‌రిపై సూర్య వేటు, గిల్ వ‌ల్లే మ‌రొక‌రు బ‌లి..ఫ్రీగా మ్యాచ్ చూడాలంటే
Advertisement

Ind vs SA 3rd T20I: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించగా, రెండవ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఈ మూడవ టి20 రెండు జట్లకు చాలా కీలకము కానుంది. దీంతో ఈ మూడో మ్యాచ్ కోసం ఫ్యాన్స్ కూడా ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ టి20

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య ఇవాళ మూడవ టి20 ( India vs South Africa, 3rd T20I
) జరగనుంది. ధర్మశాల లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ( Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala ) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ధర్మశాల చేరుకున్న టీమిండియా , దక్షిణాఫ్రికా ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఎప్పటిలాగే ఈ మూడవ టి20 కూడా రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. ఆరున్నర గంటలకు ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

జియో హాట్ స్టార్ లో ( Jio Hotstar) ఈ మ్యాచ్ ప్రసారాలు ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో ( Stae Sports) కూడా మ్యాచ్ లు వస్తున్నాయి. మూడవ టి20 నేపథ్యంలో ఇద్దరిపై వేటు వేసేందుకు సూర్యకుమార్ సేన సిద్ధమైంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి పై వేటువేసి మరో ఇద్దరు కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకురానున్నారు. వాషింగ్టన్ సుందర్ తో పాటు కుల్దీప్ యాదవ్ కు మూడవ టి20 లో ఛాన్స్ రానుందట. అటు గిల్ కు ఈసారి చివరి చాన్స్ ఇవ్వబోతున్నారట. దీంతో సంజు మరోసారి రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.

Advertisement

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ( వైస్ కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: ఐడెన్ మార్క్రామ్(c), క్వింటన్ డి కాక్(w), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, అన్రిచ్ నార్ట్జే/కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్‌మన్, లుంగి ఎన్గిడి

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×