E-Paper
Advertisement

T20 World Cup 2026: నేటి నుంచే టీ20 ప్ర‌పంచ క‌ప్‌..USAతో మ్యాచ్‌, టీమిండియా నుంచి ముగ్గురు ఔట్

T20 World Cup 2026: నేటి నుంచే టీ20 ప్ర‌పంచ క‌ప్‌..USAతో మ్యాచ్‌, టీమిండియా నుంచి ముగ్గురు ఔట్
Advertisement

T20 World Cup 2026:  టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. నేటినుంచి ప్రారంభం కాబోతున్న ఈ టోర్నమెంట్ దాదాపు 30 రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ టోర్నమెంట్ ప్రారంభ రోజు ఏకంగా మూడు మ్యాచ్లు నిర్వహించేలా ప్లాన్ చేశారు. పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ తో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య తొలి ఫ్లైట్ జరగనుంది.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ఇదే, ఆసీస్ కు ఎదురుదెబ్బ‌..టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ ఉచితంగా చూడాలంటే

యుఎస్ఎతో టీమిండియా తొలి మ్యాచ్

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుతో టీమ్ ఇండియా తలపడుతుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ముంబైలోని ఓంకాడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ షురూ అవుతుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియా జట్టుకు ఊహించని షాక్ కూడా తగిలింది. స్టార్ ఆటగాడు హర్షిత్ రాణా ఈ టోర్నమెంట్ నుంచి చివరి క్షణంలో తప్పుకున్నాడు. అతనికి గాయం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాద్ స్పీడ్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగబోతున్నాడు.

కాగా తొలి మ్యాచ్ నేపథ్యంలో సంజు శాంసన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్ కు దూరం అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, యూఎస్ ఏ జ‌ట్టుతో జ‌రిగే నేటి మ్యాచ్ లో టీమిండియా ఓపెన‌ర్లు ఎవ‌రు అన్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. ఇషాన్ కిష‌న్ మూడో స్థానంలో దిగుతాడ‌ని ప్ర‌క‌టించారు కెప్టెన్ సూర్య కుమార్‌. అంటే సంజుకు ఈ మ్యాచ్ లో ఛాన్స్ వ‌స్తుంది. సంజు, అభిషేక్ శ‌ర్మ ఓపెన‌ర్లు గా బ‌రిలోకి దిగుతారు.

Advertisement

టీమిండియా వర్సెస్ అమెరికా జ‌ట్ల అంచ‌నా

టీమిండియా ప్లేయింగ్ 11 అంచ‌నా: ఇషాన్ కిషన్ (వికెట్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్‌), శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.

USA ప్లేయింగ్ 11 అంచ‌నా: మోనాంక్ పటేల్ (c), ఆండ్రీస్ గౌస్ (WK), సాయితేజ ముక్కమల్ల, షయాన్ జహంగీర్, మిలింద్ కుమార్, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, అలీ ఖాన్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్.

Also Read: Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే

 

Related News

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

రోహిత్,కోహ్లీ లేకపోతే..మ్యాచ్ లో కిక్కే లేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

ఒరేయ్ నఖ్వీ…ట్రోఫీలు కాదు, దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లు దొంగతనం చెయ్

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

Big Stories

Advertisement
×