Ind vs WI, 2nd Test: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ ఢిల్లీలో మరో మ్యాచ్ కు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా, మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వెస్టిండీస్ మొదట బౌలింగ్ చేయనుంది. మొదటి టెస్ట్ లో ఉన్న ప్లేయర్లు దాదాపు ఈ రెండు టెస్టులో ఉన్నారు. బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని మొదట అనుకున్నప్పటికీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( ICC World Test Championship 2023-2025 )పాయింట్ల పట్టికను ఉద్దేశించి అతన్ని ఆడించుతున్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి, ఇప్పుడు ఢిల్లీ టెస్ట్ కు సిద్ధమైంది టీం ఇండియా. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium, Delhi ) వేదికగా ఈ రెండో టెస్టు జరగనుంది. 9 గంటలకు టాస్ ప్రక్రియ జరగగా 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్ అలాగే కెఎల్ రాహుల్ ఇద్దరు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. అనంతరం సాయి సుదర్శన్, టీమిండియా కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేస్తారు. జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ ప్రసారాలు చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తుంది.
ఈ మ్యాచ్ పై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( World Test Championship 2023-2025 ) రేటింగ్ ఆధారపడి ఉంటుంది. ఇందులో టీమ్ ఇండియా విజయం సాధిస్తే ఖచ్చితంగా డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత శ్రీలంక రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో స్థానంలో టీం ఇండియా ఉంది. ఇప్పటివరకు WTC సర్కిల్ లో ఆరు మ్యాచ్ లో మూడు గెలిచి రెండిటిలో ఓడిపోయింది టీమిండియా. ఒకటి డ్రా అయింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది టీమిండియా. ఈ మ్యాచ్ లో గెలిస్తే నాలుగో విజయం నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్తుంది.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(C), టెవిన్ ఇమ్లాచ్(w), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), ధ్రువ్ జురెల్(w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్