BigTV English

India beat Zimbabwe: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

India beat Zimbabwe: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

INDIA vs ZIMBABWE 4th T20I 2024 Live Score: పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ ను సొంతం చేసుకున్నది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీని కైవసం చేసుకున్నది.


శనివారం జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ ను భారత్ 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు తీసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది.

Also Read: అతనికి సాయం చేయండి.. అవసరమైతే నా పెన్షన్ ఇస్తా: కపిల్ దేవ్


ఓపెనర్లుగా బ్యాటింగ్ చేసిన యశస్వీ జైస్వాల్, శుభ్ మన్ గిల్.. ఆతిథ్య జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడిన ఈ జంట రికార్డు పరుగులు తీసింది. జైస్వాల్ 93(నాటౌట్), గిల్ 58(నాటౌట్) పరుగులు తీశారు. దీంతో టీమిండియా గెలుపు బాట పట్టింది. 10 వికెట్లతో గెలిచిన గిల్ సేన 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు మరుమాని (32), మధెవర్ (25) పరుగులు తీసి ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికిందర్ రజా(46 – 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లు) దూకుడుగా ఆడాడు. బ్రియాన్ బెనెట్(9) పరుగులు తీశాడు. క్యాంప్ బెల్(3), మేయర్స్(12), మండాడే(7) పరుగులు తీశారు.

భారత బౌలర్లు.. ఖలీల్ అహ్మద్ -2, శివమ్ దూబె, సుందర్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్ పాండే తలో వికెట్ తీశారు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×