Rajeev Shukla – Dhoni: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలామంది క్రికెటర్లు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా క్రికెట్ నుండి రాజకీయాలలోకి అడుగుపెట్టిన వారిలో మనోజ్ ప్రభాకర్, కీర్తి ఆజాద్, శ్రీశాంత్, అజారుద్దీన్, గౌతమ్ గంభీర్ ఉన్నారు. అయితే ఈ కోవలోకి జార్ఖండ్ డైనమేట్ మహేంద్రసింగ్ ధోని కూడా చేరబోతున్నాడు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Pandya- Natasha: పాండ్యా పొలంలో మొలకలు వచ్చాయి.. నటాషాతో కలిసి ఫోటోలు !
ధోని అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే మాజీ కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నేత సంజయ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడో తెలియదు కానీ.. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాత్రం రాజకీయాలలోకి ప్రవేశిస్తాడని అన్నారు. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలో చేరేందుకు ధోని సిద్ధంగా ఉన్నాడని , పార్టీలో చేరే అంశంపై చాలా కాలంగా బిజెపి అధినాయకత్వం – ధోని మధ్య చర్చలు జరుగుతున్నాయని సంచలనం వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ, క్రీడా వర్గాల్లో సంచలనంగా మారాయి. కానీ ధోని మాత్రం ఇప్పటివరకు రాజకీయాల వైపు చూపు కూడా తిప్పలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ధోని రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. ఈ ఐపీఎల్ 2025 సీజన్ ధోనికి చివరి సీజన్ అని, ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.
ధోని భారత దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన క్రికెటర్. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టివ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జో రూట్, కేన్ విలియమ్ సన్ వంటి ప్లేయర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ధోని ఏమాత్రం తక్కువ కాదు. 2007 టి-20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ధోని సారథ్యంలో భారత జట్టు గెలుపొందింది.
ఇదిలా ఉంటే.. ధోని ఇప్పటివరకు రాజకీయాలలోకి రాకపోవడానికి కారణం అతడు వ్యక్తిగత మొబైల్ ని వాడడం లేదని.. అతడిని సంప్రదించాలంటే ముందుగా అతని ఏజెంట్ కి ఫోన్ చేయాలని ధోని సహచరులు బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల ఇటీవల ధోనీకి మంచి రాజకీయ నాయకుడు కాగల సామర్థ్యం ఉందని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: Sachin Tendulkar: పాకిస్థాన్ వల్లే నా కెరీర్ మారింది.. ఆ 9 గంటలు చుక్కలు చూశా ?
ధోనీకి ఫుల్ పాపులారిటీ ఉందన్నారు రాజీవ్ శుక్లా. రాజకీయ ప్రవేశం గురించి మాహీతో గతంలో మాట్లాడిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఒకసారి ధోని లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారని పుకార్లు వచ్చాయని.. అదే విషయం అతడితో చెప్పానని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమేనని మాహీ కొట్టిపారేశాడని చెప్పుకొచ్చారు. ధోని పొలిటికల్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు రాజకీయాల్లోకి వస్తే అదిరిపోతుందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. అక్కడా సక్సెస్ అవుతాడని చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మాహీ లాంటి వ్యక్తికి రాజకీయాలు సెట్ కావని కామెంట్స్ చేస్తున్నారు.
🗣 BCCI vice-president Rajeev Shukla spoke about MS Dhoni's future with politics and revealed an interesting conversation.#MSDhoni #RajeevShukla #CricketTwitter pic.twitter.com/eKS0w0JYOu
— InsideSport (@InsideSportIND) February 2, 2025