BigTV English

India Women Vs New Zealand Women: న్యూజిలాండ్ చేతిలో.. టీమిండియాకు మరో ఓటమి

India Women Vs New Zealand Women: న్యూజిలాండ్ చేతిలో.. టీమిండియాకు మరో ఓటమి

 


India Women Vs New Zealand Women: న్యూజిలాండ్ చేతిలో టీమిండియా కు మరో ఓటమి ఎదురైంది. శనివారం రోజున రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్… చేతిలో పురుషుల టీమిండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఆదివారం రోజున… న్యూజిలాండ్ చేతిలో ఉమెన్స్ టీమిండియా జట్టు ( India Women ) కూడా… ఓటమిని చవిచూసింది. ఇవాళ… అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

India Women Vs New Zealand Women White Ferns Level Series With Crucial Win In 2nd ODI

ALSO READ: IPL 2025: మరో 3 ఏళ్లు ఐపీఎల్‌ ఆడనున్న ధోని..ఇక ఫ్యాన్స్‌ కు పండగే?


అయితే ఈ వన్డే మ్యాచ్లో… అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ జట్టు… ఉమెన్స్ టీమ్ ఇండియాను ఓడించింది. ఏకంగా టీమిండియా పైన 76 పరుగుల తో న్యూజిలాండ్ ఉమెన్స్ విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ ( New Zealand Women ) జట్టు… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 259 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో… టీమిండియా ఉమెన్స్ ( India Women ) జట్టు… అట్టర్ ఫ్లాఫ్ అయింది.

Also Read: MS Dhoni: ఐపీఎల్‌ 2025 నుంచి ఔట్‌..ఝార్ఖండ్‌ ఎన్నికల బరిలోకి ధోనీ ?

47.1 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి… 183 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా ఉమెన్స్ జట్టు. దీంతో 76 పరుగులు తేడాతో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియా టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయింది. స్మృతి మందాన డకౌట్ కాగా… షఫాలీ వర్మ 11 పరుగులకే వికెట్ కోల్పోయింది.

Also Read: IND VS NZ: రెండో టెస్ట్ లో టీమిండియా ఓటమి..69 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన న్యూజిలాండ్!

అటు కెప్టెన్ హార్మన్ ప్రీత్ సింగ్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక చివర్లో రాధా యాదవ్ 48 పరుగులు చేసి దుమ్ము లేపింది. 64 బంతుల్లో 48 పరుగులు చేసిన రాధా యాదవ్ 5 ఫోర్లు దంచి కొట్టింది. అయితే రాధా యాదవ్ కు… మిగతా బ్యాటర్లు సపోర్ట్ ఇవ్వకపోవడంతో… ఆమె కూడా అవుట్ అయిపోయారు. దీంతో టీమిండియా… ఈ సిరీస్ లో తొలి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే మొదటి వన్డేలో న్యూజిలాండ్ జట్టు పై ( New Zealand Women ) గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా ఉమెన్స్ జట్టు. అయితే రెండో వన్డేలో మాత్రం న్యూజిలాండ్ విజయం సాధించడం జరిగింది. దీంతో ప్రస్తుతం సిరీస్ సమ మైంది.

ఇది ఇలా ఉండగా…. టీమిండియా ఉమెన్స్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్ జట్ల మధ్య… మూడో వన్డే అక్టోబర్ 29 వ తేదీన అంటే ఎల్లుండి జరగనుంది. మంగళవారం రోజున… ఇదే స్టేడియం లో జరగనుంది. అంటే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో.. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×