BigTV English

Hardik Pandya: రెండో పెళ్లికి రెడీ అయిన హార్ధిక్ పాండ్యా.. వధువు ఎవరంటే?

Hardik Pandya: రెండో పెళ్లికి రెడీ అయిన హార్ధిక్ పాండ్యా.. వధువు ఎవరంటే?

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మళ్లీ పెళ్లికి రెడీ అయ్యాడు. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అదేంటీ.. అతడికి ఆల్రెడీ పెళ్లి అయింది కదా.. ఒక కొడుకు కూడా ఉన్నాడు.. మళ్లీ ఇప్పుడు పెళ్లి ఏంటని షాక్ అవుతున్నారా..?. మీరు విన్నది నిజమే. అతడు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు.. కానీ పెళ్లి చేసుకోబోయేది మరో అమ్మాయిని కాదు. తన భార్య నటషా స్టాంకోవిష్‌నే మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.


2020లో లాక్‌డౌన్ సమయంలో వీరి వివాహం హడావుడిగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.. హార్దిక్. తన భార్య గర్భవతి అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినప్పుడే హార్ధిక్ పెళ్లి చేసుకున్నాడని అందరికీ తెలిసింది. ప్రస్తుతం వారికి ఒక కొడుకు ఉన్నాడు.

అయితే బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని హార్థిక చిన్ననాటి కోరికట. ఈక్రమంలోనే మరోసారి ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుందట. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారట. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు హల్దీ, మెహందీ, సంగీత్, వివాహం, రిసెప్షన్ వంటి వేడుకలు జరగనున్నాయట.


ఈ వేడుకలకు క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా హార్థిక్, నటషా ప్రకటించలేదు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×