Ishan Kishan – Abbas: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ {Ishan Kishan} కాస్త గ్యాప్ తీసుకోవడంతో అతడిని జట్టు నుండి బయటకు పంపించేశారు. ఆ తర్వాత భారత జట్టులో ఎంట్రీ ఇచ్చేందుకు ఇషాన్ కిషన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోను ఇషాన్ కిషన్ ని ఎంపిక చేయలేదు.
దీంతో భారత జట్టులోకి పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఇషాన్ కిషన్.. తాజాగా కౌంటీ క్రికెట్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కౌంటీ ఛాంపియన్షిప్ లో నాటింగ్ హోమ్ షైర్ తరపున ఆడుతున్నాడు. తన అరంగేట్ర ఇన్నింగ్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ కేవలం 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 98 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 87 పరుగులు చేశాడు. ఇదే జట్టులో పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్ కూడా ఉన్నాడు.
అయితే ఇంగ్లాండులో జరుగుతున్న ఈ కౌంటి ఛాంపియన్షిప్ టోర్నీలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇషాన్ కిషన్.. పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ అబ్బాస్ కలిసి ఓ వికెట్ ని సాధించి మైదానంలో ఆనందాన్ని పంచుకున్నారు. అబ్బాస్ బౌలింగ్ లో క్యాచ్ రాగా.. దానిని ఇషాన్ కిషన్ పట్టుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ – మహమ్మద్ అబ్బాస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాశ్మీర్ లోని పహల్గంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లను నిషేధించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్ తో కలిసి సంబరాలు చేసుకున్న వీడియో వైరల్ గా మారింది.
ఈ సెలబ్రేషన్స్ పై కొంతమంది నెటిజెన్లు ఇషాన్ కిషన్ ని ప్రశ్నిస్తూండగా.. మరికొంతమంది మాత్రం ఇది క్రీడా స్ఫూర్తికి నిదర్శనం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కౌంటిల్లో ఇషాన్ కిషన్ కి ఇదే తొలి అసైన్మెంట్. ఇటీవలే ఇషాన్ నాటింగ్హమ్ షైర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టుతో ఇషాన్ కిషన్ ఒప్పందం కేవలం రెండు మ్యాచ్ ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఆటగాడు కైల్ వెర్రెయిన్ జింబాబ్వే తో రెండు టెస్టుల సిరీస్ లో ఆడుతున్నందున.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు.
?utm_source=ig_web_copy_link