Karthikeya Re- Release: ఇప్పుడున్న చాలామంది ఆడియన్స్ కి ఒకప్పుడు టీవీలో చూసిన సూపర్ హిట్ సినిమాలను థియేటర్లో చూడలేకపోయామే అని ఒక వెలితి ఉండేది. కానీ రీ-రిలీజ్ లు వచ్చిన తర్వాత ఆ వెలితి కూడా తీరిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న చాలామంది యూత్ ఒక సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్ దగ్గరికి వెళ్లి సినిమాను చూస్తున్నారు. కానీ ఒకప్పుడు వాళ్లకు సినిమా అంటే ఎక్కడో ఉండేది. ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఒకసారి సినిమాలు చూసే ఆస్కారం ఉండేది. అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడున్న యూత్ దాదాపు టీవీలో చూసినవే. ఒకసారి తెలుగులో రీ రిలీజ్ అయిన సినిమాలు లిస్టు చూస్తే.
ఈ రీ రిలీజ్ ట్రెండ్ అనేది మొదట చెన్నకేశవరెడ్డి సినిమాతో మొదలైంది. ఆ సినిమాకి ఆడియన్స్ బాగానే వచ్చారు.ఇకపోతే మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఒక్కడు, పోకిరి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్కడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు మహేష్ బాబు కెరియర్ సాఫ్ట్ గా సాగుతున్న తరుణంలో ఒక్కడు సినిమా మహేష్ బాబుకి ఒక స్టార్ డంను తీసుకొచ్చి పెట్టింది. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా చాలామంది ఒక్కడు సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ఒక్కడు సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రేంజ్ లో ఎక్స్పీరియన్స్ పొందారు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు చాలామంది సినిమా ప్రేమికులు.
అలానే మహేష్ బాబు పోకిరి. ఈ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అంటే పోకిరి అని చెప్పవచ్చు. ఎందుకంటే పోకిరి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని పూరి జగన్నాథ్ డిజైన్ చేసిన విధానం. ఆ సినిమాలోని పాత్రలు ఆ ట్విస్ట్, ఆ డైలాగ్స్, అన్నీ కూడా యూత్ కి ఆ టైంలో ఒక రేంజ్ లో ఎక్కాయి. అదే సినిమాను మళ్ళీ ఇప్పుడు థియేటర్లో చూస్తే సేమ్ ఫీల్ సేమ్ హై ఫీలయ్యారు చాలామంది ఆడియన్స్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు, తొలిప్రేమ, జల్సా , గబ్బర్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి వీటిని కూడా విపరీతంగా ఆడియన్స్ ఆదరించారు. ఇదే కాకుండా రఘువరన్ బీటెక్,7G బృందావన్ కాలనీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలను కూడా ఆదరించారు.
Also Read : Pushpa movie event: హైదరాబాదులో పుష్ప ఈవెంట్ కు పర్మిషన్ రాకపోతే అక్కడ ప్లాన్ చేస్తారట
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సింహాద్రి, దేశముదురు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇకపోతే కార్తీక మాసం సందర్భంగా కార్తికేయ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 28న కార్తికేయ సినిమా రీ రిలీజ్ కానుంది. చందు మొండేటి దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరియర్ లో ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి సీక్వల్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమాతోనే పాన్ ఇండియా దర్శకుడిగా చందు, హీరోగా నిఖిల్ మారిపోయారు. ఎన్నో సినిమాలుకు బ్రహ్మరథం పట్టిన ఆడియన్స్ కార్తికేయ సినిమాను ఎంతలా ఆదరిస్తారో వేచి చూడాలి.