Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా లీగ్ దశలో శ్రీలంక వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే టాస్ గెలిచిన అప్గానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో అప్గాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే వేసిన చివరి ఓవర్ లో 5 సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో మొత్తం నో బాల్ తో కలిపి 32 పరుగులు రావడం విశేషం. శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే 32 పరుగులు ఇచ్చానని బాధపడుతున్న క్షణాల వ్యవధిలోనే మరో విషాదం సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బౌలర్ తండ్రి సురంగ వెల్లలాగే గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఈ మ్యాచ్ లో సిక్సర్లు కొట్టిన తర్వాత.. శ్రీలంక బౌలర్ తండ్రి చనిపోయాడు. తన కుమారుడి బౌలింగ్ లో మహ్మద్ నబీ 5 సిక్సర్లు కొట్టాడని తట్టు కోలేక గుండె ఆగి చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.
Also Read : Pat Cummins : యాషెస్ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా కి ఎదురుదెబ్బ.. కెప్టెన్ ఔట్..!
వెల్లలాగే వేసిన చివరి ఓవర్ లో నబీ ఏకంగా 5 సిక్స్ లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లలో అతను వరుసగా 6, 6, 6, నోబాల్, 6, 6 బాదాడు. దీంతో 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు అప్గాన్ ఆల్ రౌండర్. తన కుమారుడి బౌలింగ్ లో మహ్మద్ నబీ 5 సిక్సర్లు కొట్టాడని తట్టు కోలేక గుండె ఆగి చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడం గమనార్హం. వాస్తవానికి అప్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ కొట్టిన సిక్స్ ల వల్లనే చనిపోయాడని రూమర్స్ క్రియేట్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన హెల్త్ బాగాలేదు. కొలొంబో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం. నబీ కొట్టిన సిక్స్ లకు అతను చనిపోయిన దానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చేసింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నబీ.. అప్గానిస్తాన్ తరపున ఫాస్టెస్ట్ 50 చేసిన ఆటగాడిగా అజ్మతుల్లా ఒమర్జాయ్ (హాంకాంగ్) పై రికార్డును సమం చేసాడు. అప్గాన్ కి చెందిన బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో గ్రూపు ‘B’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4 కి అర్హత సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కీలక మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో అప్గాన్ పై విజయం సాధించింది. ఈ గ్రూపు లో మూడు విజయాలతో శ్రీలంక టాప్ ప్లేస్ లో ఉండగా.. రెండు విజయాలతో బంగ్లాదేశ్ టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతోంది. దీంతో అప్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్ 4 కి అర్హత చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు సాధించింది. దీంతో ఆ జట్టు విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక బ్యాటర్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా రెచ్చిపోయారు.
?igsh=Zno5OHBtNzk5bDBi