Suryakumar Yadav : ఆసియా కప్ 2025లో భాగంగా లీగ్ దశలో భారత్ వర్సెస్ ఒమన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ లో టీమిండియా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు ప్రకటించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరోవైపు ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే..? ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కి రావాల్సిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి రాకుండా సంజూ శాంసన్ కి అవకాశం కల్పించాడు. ఇక చివరి వరకు కూడా సూర్య బ్యాటింగ్ కి రాలేదు. ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది.
Also Read : Dunith Wellalage : ఇంట్లోనే తండ్రి శవం.. ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంక క్రికెటర్ పయనం
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎప్పటి మాదిరిగానే అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. అయితే మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ మాత్రం కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఒమన్ బౌలర్ షా ఫైసల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతొ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన సంజు శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని సంజు శాంసన్ కి త్యాగం చేయడంతో దానికి న్యాయం చేశాడనే చెప్పవచ్చు. 45 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 56 పరుగులు చేశాడు సంజు శాంసన్. తన వన్ డౌన్ ని సంజు శాంసన్ కి ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ తరువాత బ్యాటింగ్ కి వస్తాడనుకుంటే.. అస్సలు బ్యాటింగ్ కే రాలేదు. సూర్యకుమార్ యాదవ్ ఒమన్ పై కొట్టే సిక్స్ లను చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశనే మిగిలిచింది. టీమిండియా 8 వికెట్లు కోల్పోయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బ్యాటింగ్ కి రాలేదు. ఇది క్రికెట్ అభిమానుకే షాక్ అనిపించడం విశేషం.
ముఖ్యంగా ఇది నామమాత్రపు మ్యాచ్ అని.. మిగతా బ్యాటర్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ కి అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. తాను బ్యాటింగ్ కి రాకుండా బౌలర్లను కూడా బ్యాటింగ్ కి పంపించడం అస్సలు ఎవ్వరికీ అర్థం కాలేదు. గత రెండు మ్యాచ్ ల్లో నాటౌట్ గా నిలిచిన సూర్యకుమార్.. తనకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించిందని.. అందుకే మిగతా వారికి ఛాన్స్ ఇచ్చాడని పలువురు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు మీడియాతో మాట్లాడుతూ.. “ఇంకా 2, 3 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అర్ష్ దీప్ సింగ్ నన్ను బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. కానీ నేను బ్యాటింగ్ కి రాలేదు. సమస్య లేదు అని నేను అర్ష్ దీప్ సింగ్ తో నవ్వుతూ చెప్పాను అని గుర్తు చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరోవైపు టీమిండియా కి ఆదివారం పాకిస్తాన్ తో సూపర్ 4 మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కి కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో సూర్యకుమార్ రెస్ట్ తీసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు.