Big Stories

INDW vs ENGW 2nd T20 : బ్యాటింగ్ ఘోరం: రెండో టీ 20లో అమ్మాయిల ఓటమి

INDW vs ENGW 2nd T20 : అత్యంత చెత్త బ్యాటింగ్ కారణంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమ్ ఇండియా అమ్మాయిలు ఓడిపోయారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ 20ల సిరీస్ ను 2-0తో అప్పగించారు. ముంబయి వాంఖేడి స్టేడియంలో జరిగిన ఉమెన్స్ టీ 20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు వేసే బాల్స్ ను ఎలా ఆడాలో తెలీక, గల్లీ క్రికెట్ ఆడుతున్న చందంగా వికెట్లు పారేసుకున్నారు.  16.2 ఓవర్లలో ముక్కుతూ మూల్గుతూ టీమ్ ఇండియా 80 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తర్వాత  11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది.

- Advertisement -

ఒకవైపు ఐపీఎల్ వేలం జరుగుతోంది. మరి ఆ ఎఫెక్ట్ పడిందో ఏమో తెలీదు. ఇక్కడ చాలా అనాసక్తిగా బ్యాటింగ్ ప్రారంభించారు. ఎంతో ఆశావాహ దృక్పథంతో ఉండే అమ్మాయిలు, ఈసారెందుకో ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. కనీసం మొదటి టీ 20 మ్యాచ్ లో పోరాడైనా ఓడిపోయారు. ఈసారి అది లేశమాత్రం కూడా కనిపించ లేదు.

- Advertisement -

బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా అసలు ఖాతా  ప్రారంభించకుండానే ఓపెనర్ షెఫాలి వర్మ వికెట్ కోల్పోయింది. ఇంక అక్కడ నుంచి పేకమేడలా కూలిపోయింది. కాకపోతే జెమీమా (30) మాత్రం సంయమనంగా ఆడటంతో ఆ 80 పరుగులైనా టీమ్ ఇండియా చేయగలిగింది. మరో ఓవెనర్ స్మ్రతి మంథాన (10) చేసింది. ఆ తర్వాత ఎవరూ కూడా రెండంకెల స్కోరు చేయలేదు.

ఇంగ్లాండ్ బౌలింగ్ లో డీన్ 2, లారాన్ బెల్ 2, సారా గ్లెన్ 2, సోఫీ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత స్పల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ కూడా తడబడింది. కాకపోతే టీమ్ ఇండియా మరో 20 పరుగులైనా చేసి ఉంటే, కచ్చితంగా ఇంగ్లాండ్ ని నిలువరించే వారే. కానీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా బౌలర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతూ 11.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించింది.

ఇంగ్లాండ్ ఓపెనర్లు కూడా 19 పరుగులకే అవుట్ అయ్యారు. ఇది బౌలింగ్ పిచ్ లాగే కనిపిస్తోంది, బౌలర్లకి వికెట్లు పడుతున్నాయని అనుకున్నారు. అయితే క్యాప్సీ, నాట్ సివర్ జట్టుని లక్ష్యం దిశగా నడిపించారు. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద టీమ్ ఇండియా వడివడిగా మూడు వికెట్లు పడగొట్టింది. లక్ష్యం చిన్నది కావడంతో ఇంగ్లాండ్ సులువుగా విజయం సాధించింది.

భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2, దీప్తీ శర్మ 2 వికెట్లు తీశారు.

ఈ రెండు జట్ల మధ్య సిరీస్ లో ఆఖరి వన్డే ఈరోజు ఆదివారం ఇదే ముంబయి వాంఖేడి స్టేడియంలో జరగనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News