BigTV English

Shardul Thakur : శార్దూల్‌కి గాయం.. రెండో టెస్ట్‌కి డౌట్..?

Shardul Thakur : శార్దూల్‌కి గాయం.. రెండో టెస్ట్‌కి డౌట్..?

Shardul Thakur : సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో తొలి టెస్ట్ ఆడిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్  గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుడి భుజానికి బాల్ తగలింది. తీవ్రంగా ఇబ్బంది పడ్డ తను ప్రాక్టీస్ సెషనల్ లో పాల్గొనలేదు. గాయం తీవ్రత తెలీదుగానీ.. రెండో టెస్టులో ఆడటం అనుమానంగానే మారింది.


ఆల్రడీ తన స్థానం మొదటి టెస్ట్ తర్వాత సంధిగ్ధంలో పడిందనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే తొలిటెస్ట్ లో తను పెద్దగా ప్రభావం చూపించలేదు. తొలి ఇన్నింగ్స్ లో 24 పరుగులు చేసి కేఎల్ రాహుల్ కి అండగా నిలిచాడు. కానీ రెండో ఇన్నింగ్స్ కి వచ్చేసరికి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు.

అలాగే బౌలింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేక పోయాడు. 19 ఓవర్లు వేసి ధారాళంగా 101 పరుగులు ఇచ్చాడు. కేవలం ఒక వికెట్ మాత్రమే లభించింది. ఈ పరిస్థితుల్లో శార్దూల్ తో మరో ప్రయోగానికి టీమ్ మేనేజ్మెంట్ సిద్ధంగా లేదని సమాచారం.


ప్రస్తుతం నెట్స్ లో ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్న రవీంద్ర జడేజాకి అవకాశం లభిస్తుందని అంటున్నారు. ఎందుకంటే తను కూడా ఆల్ రౌండర్ కావడం, మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

ప్రస్తుతం శార్దూల్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణకి అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. తన హైట్ తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడతాడని అనుకుంటే తేలిపోయాడు. కాకపోతే నెట్స్ లో మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. అయితే ఎంత కనిపించినా రెండో టెస్ట్ కి ఆవేశ్ ఖాన్ లేదా ముకేష్ కుమార్ తన ప్లేస్ లో వచ్చే అవకాశాలున్నాయి.

ఈ రెండు మార్పులే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు బ్యాటర్లు కూడా ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదటి టెస్ట్ లో విఫలమవడం, రెండో టెస్ట్ ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇది చావు బతుకుల సమస్యగా మారిపోయింది. ఎంత కష్టమైనా సరే, మ్యాచ్ గెలిచి సిరీస్ ని డ్రా చేసి గుడ్డిలో మెల్లలా భారత్ వెళ్లాలని కృత నిశ్చయంతో సాధన చేస్తున్నాయి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×