BigTV English

Sales of chicken and mutton : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. 10.5 లక్షల కేజీల చికెన్, 5.5 లక్షల కేజీల మటన్ కుమ్మేశారు..

Sales of chicken and mutton : తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను. డిసెంబర్ 31 అంటేనే ఎంజాయ్ మెంట్ డే అంటారు. అదీ ఆదివారం కావడంతో మరింత జోష్ పెంచింది. దీంతో తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను.

Sales of chicken and mutton :  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. 10.5 లక్షల కేజీల చికెన్, 5.5 లక్షల కేజీల మటన్ కుమ్మేశారు..

Sales of chicken and mutton : తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను. డిసెంబర్ 31 అంటేనే ఎంజాయ్ మెంట్ డే అంటారు. అదీ ఆదివారం కావడంతో మరింత జోష్ పెంచింది. దీంతో తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను.


సాధారణంగా డిసెంబర్ 31 నైట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. యువత జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాత సంవత్సరానికి గుడ్ బై పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సంతోషంలో మునిగిపోతుంటారు. అయితే ఆ రోజు చికెన్, మటన్ షాపులు బిజీ బీజీగా ఉన్నాయి. ఉదయం నుంచి మటన్, చికెన్, చేపల మార్కెట్ లో జనాలు కిక్కిరిసి పోయారు. అయితే గడిచిన 24 గంటలలో ఏకంగా 10.5 లక్షల కేజీల చికెన్ , 5.5 లక్షల కెజీల మటన్ ను అమ్మివేశారు.

డిసెంబర్ 31, అందులోనూ ఆదివారం ఇంకేముంది.. జనాల ఎంజాయ్‌మెంట్ కి అడ్డులేకుండా పోయింది. దీంతో నాన్ వెజ్ షాపులు, మందు దుకాణాలు కిటకిటాలాడిపోయాయి. కొత్త ఎడాదిని మస్తు మస్తుగా ఎంజాయ్ చేశారు తెలంగాణ వాసులు. దీంతో నాన్ వెజ్ అమ్మకాలు గత ఏడాది కన్నా ఈ ఏడాది మరింత పెరిగినట్లు తెలుస్తుంది.


మాములు రోజుల్లో అయితే దాదాపుగా 3 లక్షల కేజీల వరకు చికెన్ అమ్ముడుపోతుంది. కానీ నిన్న ఒక్కరోజే 10.5లక్షల చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. కార్తీక మాసం అయిన తర్వాత మళ్లీ చికెన్ అమ్మకాలు పెరిగిపోయాయి. నిన్న అది కాస్త రెట్టింపు అయ్యిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ రూ.230 ధర ఉంది. అయితే నిన్న ఒక్క రోజే దాదాపు 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీ రంగ నిపుణులు తెలిపారు.

ఇక మటన్ సైతం రికార్డు స్థాయిలో అమ్ముడు పోయినట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే ఏకంగా 5.5 లక్షల కేజీల మటన్ అమ్మడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్ లో మటన ధర కిలో రూ.800 నుంచి రూ.900 వరకు ఉంది. అయినా కూడా మాంసాహారులు ఏ మాత్రం వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. సికింద్రాబాదు, రాంనగర్, జియాగూడ, మోండా మార్కెట్ లో ఫిష్ విక్రయం కూడా భారీగానే జరిగినట్లు సమాచారం. 2 వేల క్వింటాళ్ల వరకు అమ్ముడు పోయినట్లు వ్యాపారస్తులు వెల్లడించారు.

కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ అర్థరాత్రి 12 గంటల వరకు పిల్లలు, పెద్దలు, యువత, కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఇక నగరంలో హూటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లులు, పబ్‌లలో ప్రత్యేక ఏర్పాటు నిర్వహించారు. రికార్డు డ్యాన్సులు, పాటలతో నూతన సంవత్సరానికి కేక్ లు కట్ చేసి స్వాగతం పలికారు.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×