BigTV English

CM Revanthreddy : మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..

CM Revanthreddy : మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ఆయన స్పష్టం చేశారు. భెల్‌ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందన్నారు.

CM Revanthreddy : మెట్రో,  ఫార్మా సిటీని రద్దు చేయట్లేదు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..

CM Revanthreddy : మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ఆయన స్పష్టం చేశారు. భెల్‌ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందన్నారు.


ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే మెట్రో లైన్‌కి లింక్ చేస్తామని సీఎం చెప్పారు. ఫార్మాసిటీని రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకు గృహనిర్మాణం కూడా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడివాళ్లు హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లుగా క్లస్టర్లు ఉంటాయన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్‌గా మారుస్తామన్న సీఎం రేవంత్‌.. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా స్కిల్స్ పై శిక్షణ ఉంటుందని చెప్పారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉండటంతో పాటుగా అదనంగా స్కిల్స్ ఉంటాయన్నారు. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామన్న రేవంత్‌.. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. వంద పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందని.. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జనవరి మూడో తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందన్న రేవంత్‌రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్కలూ పరిష్కరిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించామని ….వారికీ అవసరమైన మేన్‌ పవర్‌ వాళ్ళే పిక్ చేసుకుంటారని సీఎం అన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తానే చూస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామని.. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నట్లు సీఎం చెప్పారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×