Saud Shakeel: పాకిస్తాన్ లోని రావాల్పిండి స్టేడియం వేదికగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ – పాకిస్తాన్ టెలివిజన్ జట్ల మధ్య మార్చి 4వ తేదీ నుండి ప్రెసిడెంట్ కప్ గ్రేడ్ – వన్ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అయితే రంజాన్ మాసం కావడంతో ఈ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ ని రాత్రి వేళల్లో నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లు రాత్రి 7:30 గంటలకు మొదలై.. మధ్య రాత్రి 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి.
Also Read: Steve Smith Retires: ఆస్ట్రేలియాలో కుదుపు… స్టీవెన్ స్మిత్ రిటైర్మెంట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ – పాకిస్తాన్ టెలివిజన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమ్రాన్ బట్ {88}, రమీజ్ అజీజ్ {40}, ఘాజీ గోరి {14}, నయిజ్ ఖాన్ {22} పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
పాకిస్తాన్ జాతీయ జట్టు సభ్యుడు, స్టార్ టెస్ట్ క్రికెటర్ సౌద్ షకీల్ విచిత్రంగా పెవిలియన్ చేరాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ జట్టుకు అతడు బ్యాటింగ్ చేయాల్సి ఉండగా, ఈ మ్యాచ్ లో షకీల్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగాల్సి ఉన్న సమయంలో అతడు ఘాడ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అతడు నిర్దేశిత మూడు నిమిషాల వ్యవధిలో క్రీజ్ లోకి చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి కెప్టెన్ టైమ్డ్ అవుట్ కోసం ఆపిల్ చేయగా.. అంపైర్ అవుట్ గా ప్రకటించాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ జట్టు 128-1 స్కోర్ వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్ మహమ్మద్ పెహజాద్ వరుస బంతుల్లో ఉమర్ అమీన్{6}, ఫహాద్ అలం {0} లను అవుట్ చేశాడు. దీంతో షకీల్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ సమయంలో అతడు నిద్రపోయి క్రియేట్ లోకి రావడం ఆలస్యం కావడంతో టైమ్డ్ అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో షకీల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో టైమ్డ్ అవుట్ అయిన ఏడవ క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
Also Read: Shubman Gill: హెడ్ క్యాచ్… గిల్ కు అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. పాకిస్తాన్ టెలివిజన్ జట్టు బౌలర్లలో.. మహమ్మద్ షాజద్ 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే అలీ ఉస్మాన్ 2, అమద్ బట్, మెహరీన్ సన్వాల్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు 19 ఓవర్లకే 49 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. పాకిస్తాన్ టెలివిజన్ బ్యాటర్లలో షామైల్ హుస్సేన్ 6, ఇమామ్ ఉల్హాక్ 9, వాఖర్ హుస్సేన్ {21*}, మహమ్మద్ తాహ 0, మహమ్మద్ మోసిన్ {13*} పరుగులు చేశారు.