E-Paper

UPI Payments: ఆర్టీసీ కండక్టర్ల క్యూఆర్ కోడ్ విప్లవం.. కేవలం 11 నెలల కలెక్షన్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..!

UPI Payments: ఆర్టీసీ కండక్టర్ల క్యూఆర్ కోడ్ విప్లవం.. కేవలం 11 నెలల కలెక్షన్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..!
Advertisement

UPI Payments: స్వేచ్ఛ బ్యూరో: ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఒకప్పుడు జేబులో ‘చిల్లర’ ఉందో లేదో చూసుకోవడం ప్రయాణికులకు తలనొప్పిగా ఉండేది. కండక్టర్‌కు, ప్రయాణికుడికి మధ్య వాదనలు, చిల్లర సమస్యలు నిత్యం జరిగేవి. కానీ, ఇప్పుడు వాటిక్ చెక్ పడింది. డిజిటల్ లావాదేవీలో అందుబాటులోకి రావడంతో జేబులో ఒక్క రూపాయి నగదు లేకపోయినా ప్రయాణం సులువు అయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు నిశ్చింతగా బస్సెక్కి ప్రయాణించవచ్చనే ధీమా ప్రయాణికుల్లో పెరిగింది. టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపుల (యూపీఏ) విధానం సంస్థ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి ఊహించని స్థాయిలో అద్భుతమైన స్పందన వస్తోంది.

అసాధారణ రికార్డు..

​ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలు ప్రారంభంలో కేవలం రోజుకు 2 వేల రూపాయల లావాదేవీలతో మొదలైనది. ఈ డిజిటల్ ప్రయాణం, నేడు ఊహించని రికార్డులను సృష్టిస్తోంది. ప్రస్తుతం రోజువారీ యూపీఐ చెల్లింపులు ఏకంగా రూ. 2.5 కోట్ల మైలురాయిని దాటడం విశేషం. సాంకేతికతను ప్రజలు అందిపుచ్చుకోవడం, ప్రయాణికులను డిజిటల్ వైపు మళ్లించడంలో ఆర్టీసీ సాధించిన ఈ విజయం ఇప్పుడు రవాణా రంగంలో ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. గత 11నెలల స్వల్ప కాలంలోనే సంస్థ రికార్డు స్థాయిలో 42.75 కోట్ల డిజిటల్ టికెట్లను జారీ చేసింది. రూ.505.95 కోట్ల భారీ యూపీఐ ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఘననీయమైన వృద్ధిరేటు..

Advertisement

​డిజిటల్ గణాంకాలను పరిశీలిస్తే ఆర్టీసీలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎంత వేగంగా జరిగిందో స్పష్టమవుతోంది. మార్చి 2025లో కేవలం 5.25 లక్షలుగా ఉన్న డిజిటల్ టికెట్ల సంఖ్య, జూన్ 2026 నాటికి ఏకంగా 64.17 లక్షలకు చేరింది. ఇది సుమారు 1122.29 శాతం అద్భుతమైన వృద్ధి. యూపీఐ చెల్లింపులు ప్రారంభమైన తొలి నెలలో (మార్చి 2025) ఆదాయం కేవలం రూ. 5.41 కోట్లుగా నమోదు కాగా, జనవరి 2026 నాటికి అది ఏకంగా రూ. 73.90 కోట్లకు చేరి, 1265.99 శాతం మెరుపు వృద్ధిని సాధించింది. కేవలం 11 నెలల కాలంలోనే టికెట్ల సంఖ్య సుమారు 11 రెట్లు, ఆదాయం సుమారు 13 రెట్లు పెరిగింది.

Also read: ఈసారి రూట్ మార్చిన ఈవీవీ వారసులు.. గుండెల్ని పిండేసే కథతో వస్తున్న ఆర్యన్ రాజేష్!

​పారదర్శకత.. భద్రత

Advertisement

​మొబైల్ యాప్‌లు, కండక్టర్ల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) స్కానింగ్‌లపై ప్రయాణికుల్లో నమ్మకం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద నగదు వినియోగం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ డిజిటల్ మార్పు అనేది కేవలం ఒక సాంకేతిక సౌకర్యం మాత్రమే కాదు.. అది సంస్థ ఆదాయానికి పూర్తి భద్రతను, పారదర్శకతను ఇస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ రూపాయి నేరుగా బ్యాంక్ ఖాతాకే చేరుతుండటంతో లీకేజీలకు తావు లేకుండా పోయింది. అటు ప్రయాణికులకు సమయం కలిసిరావడంతో పాటు, ఇటు కండక్టర్లకు కూడా చిల్లర వెతుక్కునే తలనొప్పి తప్పి విధులు నిర్వహించడం సులువైందని పలువురు పేర్కొంటున్నారు.

నెల వృద్ధిరేటు శాతం

జనవరి (2026) 24.89
ఫిబ్రవరి 26.05
మార్చి 27.67
ఏప్రిల్ 28.29
మే 28.35
జూన్ 28.87

సగటు వృద్ధిరేటు శాతం 27.39%

Also read: సల్కం చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్.. నివేదిక ఇవ్వని ప్రభుత్వ శాఖలు!

సమయం ఆదా..

​డిజిటల్ తో ప్రయాణికుల సమయం ఆదా, సురక్షితమైన లావాదేవీలు జరగడంతో రానున్న రోజుల్లో వంద శాతం ‘క్యాష్ లెస్ ఆర్టీసీ’ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. సాంకేతికతతో ప్రయాణికులకు మరింత చేరువవుతూ ఆర్టీసీ సరికొత్త రికార్డుల బాట పడుతుంది.

​డిజిటల్ సక్సెస్ మోడల్‌గా ఆర్టీసీ..

ఆర్టీసీలో డిజిటలైజేషన్ అనేది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. ప్రయాణికుల అవసరాలను, ఇబ్బందులను నిరంతరం అర్థం చేసుకుంటూ దశలవారీగా ప్రవేశపెట్టిన నిరంతర ప్రక్రియ ఇది. రోజుకు కేవలం 2 వేలతో మొదలైన ప్రయాణం, నేడు రూ. 2.5 కోట్ల సంఖ్యకు చేరడం ప్రయాణికులు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. యూపీఐ ద్వారా వేగవంతమైన లావాదేవీలు, చిల్లర సమస్యల తొలగింపు, పారదర్శకత.. ఇవన్నీ కలిసి ఆర్టీసీని ఒక విజయవంతమైన డిజిటల్ మోడల్‌గా నిలిపాయి. రానున్న రోజుల్లో మరింత స్మార్ట్, వంద శాతం ‘క్యాష్ లెస్’ ప్రయాణమే మా లక్ష్యం. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవాలిని టీజీఎస్ఆర్టీసీ రాజశేఖర్ అన్నారు.

Also read: Osmania Doctors: మా సక్సెస్ కనపడటం లేదా.. కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పరా.. సర్కార్‌పై పెద్ద డాక్టర్లు అలక!

Related News

గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య

ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

Voter Revision: సర్ తో పరేషాన్.. అయోమయంలో హైదరాబాద్ ఓటర్లు.. దిక్కులు చూస్తున్న అధికారులు!

Osmania Doctors: మా సక్సెస్ కనపడటం లేదా.. కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పరా.. సర్కార్‌పై పెద్ద డాక్టర్లు అలక!

సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్.. అధికారులపై హైకోర్టు సీరియస్, నివేదికలు ఇవ్వలంటూ..

సవాల్ విసిరి ఎందుకు వెనక్కి తగ్గారు? మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

అంతర్జాతీయ TEDx వేదికపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం

Big Stories

×