BigTV English

LSG vs RR Match Preview: రాజస్థాన్ విజయాలకు లక్నో బ్రేక్ వేసేనా..?

LSG vs RR Match Preview: రాజస్థాన్ విజయాలకు లక్నో బ్రేక్ వేసేనా..?

LSG vs RR Match Preview(Sports news headlines): ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో ఏకానా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అడుగుదూరంలో ఉంది. లక్నోపై విజయం సాధించి రాజసంగా ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టాలని రాజస్థాన్ తహతహలాడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.


రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి కేవలం గుజరాత్ టైటాన్స్‌ చేతిలో ఓటమి చవిచూసింది. మొత్తంగా 8 మ్యాచుల్లో 7 విజయాలు ఒక ఓటమితో 14 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. రాజస్థాన్ చివరి 3 మ్యాచుల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ పరంపరను కొనసాగించాలని చూస్తోంది.

ఇక లక్నో విషయానికి వస్తే ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో 5 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. లక్నో తన చివరి రెండు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఘనవిజయం సాధించి లక్నో హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ వేయాలని చూస్తోంది.


ఈ సీజన్‌లో లక్నో తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.

Also Read: ముంబై గట్టెక్కేనా?.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్

ఇక ఏకానా స్టేడియం విషయానికొస్తే లక్నో ఈ సీజన్‌లో ఇక్కడ నాలుగు మ్యాచులు ఆడగా.. మూడింట్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలయ్యింది. లక్నో పిచ్ విషయానికొస్తే స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మంచు ప్రభావం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×