BigTV English

MI Vs KKR Match Highlights: ప్లే ఆఫ్ నుంచి ముంబై అవుట్.. కోల్ కతా మరో విజయం!

MI Vs KKR Match Highlights: ప్లే ఆఫ్ నుంచి ముంబై అవుట్.. కోల్ కతా మరో విజయం!

MI vs KKR Match Highlights 2024: ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై ఆట అయిపోయింది. ప్లే ఆఫ్ నుంచి దాదాపు అవుట్ అనే చెప్పాలి. ఇప్పటికి 11 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లు సాధించింది. చివరికి 9వ స్థానంలో నిలిచింది. ఇంక ఆడాల్సినవి మూడు మాత్రమే ఉన్నాయి. అవి వరుసగా గెలిచినా 12 పాయింట్లు అవుతాయి. కనీసం 14 పాయింట్లు ఉంటేనే ప్లేఆఫ్ కి ఆశలు పెట్టుకోవచ్చునని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే ఇదే జట్టులో నలుగురు ఆటగాళ్లు రేపు టీ 20 ప్రపంచకప్ ఆడనున్నారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు.


ఇక కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. లక్ష్య ఛేదనలో ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయిపోయింది.

170 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కి దిగింది. ఎప్పటిలా ఓపెనర్స్ ఇద్దరూ ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ (11) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఫస్ట్ డౌన్ వచ్చిన నమన్ ధిర్ (11) నిలవలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆశలు రేపాడు. 35 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అయితే తన కళ్ల ముందే అందరూ అవుట్ అయిపోతూ ఉండటంతో ఒక ఎండ్ లో అలా ఉండిపోయాడు.


Also Read : టీ 20 ప్రపంచకప్ టీమ్ ప్రదర్శనతో బెంబేలు..! ఇలా ఆడితే కప్పు ఎలా..?

11.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 71 పరుగులతో ముంబై దాదాపు ఓటమికి దగ్గరగా ఉంది. అలాంటి స్కోరుని 120 వరకు సూర్య తీసుకువెళ్లాడు. అక్కడ 7వ వికెట్ గా అవుట్ అయ్యాడు. అయితే టిమ్ డేవిడ్ (24) కాసేపు పోరాడి జట్టులో ఆశలు రేపాడు. అయితే తను ఉన్నంత వరకు మ్యాచ్ ముంబై చేతుల్లోనే ఉంది. కానీ అనూహ్యంగా అవుట్ అయిపోయాడు. దీంతో ముంబై ఓటమి దాదాపు ఖాయమైపోయింది. చివరికి 18.5 ఓవర్లలో 145 పరుగుల వద్ద ముంబై ఆగిపోయింది. అలా 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

కోల్ కతా బౌలింగులో మిచెల్ స్టార్క్ 4, వరుణ్ 2, సునీల్ నరైన్ 2, ఆండ్రి రెసెల్ 2 వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతాకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ల దగ్గర నుంచి మొదలు పెడితే వరసగా 4 వికెట్లు ధనాధన్ మని పడిపోయాయి. ఫిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8), అంగ్ క్రిష్ రఘువంశీ (13), కెప్టెన్ శ్రేయాస్ (6) ఇలా ఠపీఠపీ మని అయిపోయారు. 4.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 43 పరుగులతో కోల్ కతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

Also Read: LSG vs KKR IPL 2024 Preview: సమ ఉజ్జీల పోరు.. నేడు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్ కతా

ఈ పరిస్థితుల నుంచి నెమ్మదిగా వెంకటేష్ అయ్యర్ బయటకి లాగాడు. ఓర్పుగా, నేర్పుగా ఆడాడు. 52 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రింకూసింగ్ (9) ఈసారి కూడా ఆకట్టుకోలేక పోయాడు. మళ్లీ మనిష్ పాండే నిలబడ్డాడు. 31 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. తర్వాత ఎవరూ పెద్దగా ఆడలేదు. దీంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ముంబై బౌలింగులో నువాన్ తుషారా 3, బుమ్రా 3, హార్దిక్ పాండ్యా 2, పియూష్ చావ్లా 1 వికెట్ పడగొట్టారు.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×