Big Stories

IPL 2024, DC vs GT IPL Highlights: ఉత్కంఠ పోరులో..ఢిల్లీ గెలుపు.. పోరాడి ఓడిన గుజరాత్

Delhi Capitals vs Gujarat Titans Highlights IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ గడిచేకొద్ది మ్యాచ్ ల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. చివరి బాల్ వరకు నువ్వా? నేనా? అన్నట్టు మ్యాచ్ లు సాగుతున్నాయి. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్.. చివరి వరకు హోరాహోరీగా సాగింది. చివరికి 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

- Advertisement -

టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (88*) అద్భుతంగా ఆడటంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

- Advertisement -

225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగుకి దిగిన గుజరాత్ చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి, పరాజయం పాలైంది.

వివరాల్లోకి వెళితే 225 పరుగుల భారీ లక్ష్యంతో గుజరాత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఆదిలోనే ఓపెనర్, జట్టుకి కీలకమైన కెప్టెన్ గిల్ (6) అవుట్ అయిపోయాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. 39 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: ఆడితే.. గౌరవం ఆటోమేటిగ్గా వస్తుంది: హార్దిక్‌కి సెహ్వాగ్ సూచనలు

ఈ సమయంలో తనకి మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహ సహాయపడ్డాడు. తను 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు. ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులతో పటిష్టంగా కనిపించిన గుజరాత్ అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. 14.1 ఓవర్ దగ్గరికి వచ్చేసరికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగుల ముందు నిలిచింది.

అజ్మతుల్లా ఒమర్ జాయ్ (1), షారూఖ్ ఖాన్ (8), రాహుల్ తెవాటియా (4) వీరందరూ నిరాశ పరిచారు. మరో ఎండ్ లో డేవిడ్ మిల్లర్ అందరిలో ఆశలు రేకెత్తించాడు. 23 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

సాయి కిషోర్ కొట్టిన ఒక బంతి బౌండరీ లైన్ దాటి సిక్సర్ గా వెళ్లే సమయంలో బంతిని గాల్లోనే ఫీల్డర్ అద్భుతంగా ఆపాడు. అలా మిగిల్చిన 4 పరుగులే మ్యాచ్ ని కాపాడాయని అంటున్నారు.

ఇంక చివరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రషీద్ ఖాన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాత 2 బంతులు 11 పరుగులు చేయాల్సి వచ్చింది. దాంతో  ఒక సిక్సర్ కొట్టాడు. ఇంక ఆఖరి బాల్ కి 5 పరుగులు చేయాల్సి ఉండగా, తను కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్  ఆపడంతో సింగిల్ వచ్చింది. దాంతో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయఢంకా మోగించింది. ఆఖరి ఓవర్ వేసిన ముఖేశ్ కుమార్ ఊపిరి పీల్చుకున్నాడు.

ఢిల్లీ బౌలింగులో రశిఖ్ సలమ్ 3, అన్రిచ్ 1, కులదీప్ 2, అక్షర్ పటేల్ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్లు పడగొట్టారు.

Also Read: ఆధార్ కార్డు కావాలా? వార్నర్.. ఇండియాలో సెటిల్ అయిపోతావా?: నెటిజన్ల ప్రశ్నలు

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ లో ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని ఇవ్వలేదు. ప్రథ్వీ షా (11), జాక్ ఫ్రేజర్ (23) అవుట్ అయ్యారు. తర్వాత ప్రమోషన్ మీద వచ్చిన అక్షర్ పటేల్ అదరగొట్టాడు.
43 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టి 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
షాయి హోప్ (5) వెంటనే అవుట్ అయ్యాడు.

ఈ దశలో వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 43 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేయడమే కాదు నాటౌట్ గా నిలిచాడు. తనకి సపోర్టుగా ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) నిలిచాడు.

ఇంక చివరి ఓవర్ మోహిత్ శర్మ 4 ఓవర్లలో బౌలింగుని పంత్ ఒక ఆటాడుకున్నాడు. తను వేసిన ఆఖరి ఓవర్ లో ఏకంగా 31 పరుగులు చేశాడు. అందులో 4 సిక్స్ లు, ఒక ఫోర్ ఉన్నాయి. మొత్తానికి 20 ఓవర్లలో ఢిల్లీ 224 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలింగులో సందీప్ వారియర్ 3, నూర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. మోహిత్ శర్మ 4 ఓవర్లలో 73 పరుగులు ఇవ్వడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బౌలర్ల భవిష్యత్తును కాపాడాలని, చెత్త రూల్స్ తో వారి క్రీడా జీవితాలతో ఆటలాడవద్దని నెట్టింట విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News