BigTV English

Gujarat Vs Kolkata: ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ అవుట్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు!

Gujarat Vs Kolkata: ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ అవుట్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు!

IPL 63 Match – Gujarat Titans Vs Kolkata Knight Riders Match Abandoned due to Rain: ఐపీఎల్ సీజన్ 2024 లో ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. ప్లే ఆఫ్ రేస్ లోకి వెళ్లాల్సిన గుజరాత్ ఆడకుండానే రేస్ నుంచి తప్పుకుంది. కారణం ఏమిటంటే సోమవారం కోల్ కతాతో ఆడాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు చెరొక పాయింటు కల్పించారు.


దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. తను రేస్ లో నిలవాలంటే కనీసం 16 పాయింట్లు కావాలి. కానీ గుజరాత్ దగ్గర 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆడాల్సినవి రెండు మ్యాచ్ లు ఉన్నాయి. దీంతో వరుసగా గెలిస్తే 14 పాయింట్లతో మిగిలిన జట్ల సరసన నిలిచేది. కానీ ప్రస్తుతం రద్దు అయిన కారణంగా వచ్చిన ఒక్క పాయింట్ తో గుజరాత్ ఇప్పుడు 11 పాయింట్లతో ఉంది.
మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ అందులో గెలిచినా 13 పాయింట్లు అవుతాయి.

ఆల్రడీ 14 పాయంట్లతో మిగిలిన జట్లు రెడీగా ఉన్నాయి. దీంతో గుజరాత్ అధికారికంగా నాకౌట్ అయినట్టే అని అంటున్నారు. ఆల్రడీ పంజాబ్ కింగ్స్, ముంబై తో కలిపి మూడు జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి పక్కకు జరిగినట్టే అంటున్నారు.


Also Read: ఆర్సీబీకి అవకాశాలు ఉన్నట్టా? లేనట్టా?

మరోవైపు 19 పాయింట్లు సాధించిన కేకేఆర్ టేబుల్ టాపర్‌గా ఉంది. కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయినా, టాప్-2లోనే ఉంటుంది. అదెలా అంటే.. రాజస్థాన్ రాయల్స్ మినహా ఏ జట్టు 19 పాయింట్లను అధిగమించే అవకాశం లేదు. కానీ 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ మాత్రం అధిగమించే అవకాశాలున్నాయి. ఎలాగంటే తనింకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అవి గెలిస్తే 20 పాయింట్లు సాధిస్తుంది. దీంతో టేబుల్ టాపర్ అవుతుంది.

మొత్తానికి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో గుజరాత్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Virat Kohli : AB డివిలియర్స్ తల్లిని పచ్చి బూతులు తిట్టిన కోహ్లీ… ఇదిగో షాకింగ్ వీడియో

RCB Jersey : కోహ్లీ పరువు పాయే… కుక్కకు RCB జెర్సీ వేసి దారుణం

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు ఎక్కడ అంటూ ట్రోలింగ్

Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?

Big Stories

×