BigTV English

GT Vs RCB IPL 2024 Highlights: ఆర్సీబీ విజయపరంపర.. గుజరాత్ ఓటమి..!

GT Vs RCB IPL 2024 Highlights: ఆర్సీబీ విజయపరంపర.. గుజరాత్ ఓటమి..!

Royal Challengers Bengaluru vs Gujarat Titans IPL 2024 Highlights: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ పరంపర సాగిపోతోంది. ఒకొక్క ఆటగాడు నెమ్మదిగా టచ్ లోకి వస్తున్నాడు. విరాట్ కొహ్లీ ఎప్పటిలా ఒకవైపున అడ్డంగా నిలబడిపోతున్నాడు. తర్వాత వచ్చినవాళ్లు ధనాధన్ ఆడి మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నేటి మ్యాచ్ లో విల్ జాక్స్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు.


గుజరాత్ తో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఎవరు ఊహించని విధంగా 16 ఓవర్లలోనే 206 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

వివరాల్లోకి వెళితే.. 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ కి ఆదిలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ (24) చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో విరాట్ అడ్డంగా నిలబడిపోయాడు.


ఫస్ట్ డౌన్ వచ్చిన విల్ జాక్స్ మొదటిసారి టచ్ లోకి వచ్చి వీరంగం సృష్టించాడు. 41 బాల్స్ లో 10 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో కరెక్టుగా 100 చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే తను సెంచరీ చేయడంలో విరాట్ సహకరించాడు.

Also Read: సీఎస్కే ఘన విజయం.. హైదరా‘బాదుడు’ ఏది?

ఎక్కువ స్ట్రయికింగ్ తనకే ఇచ్చి సహకరించాడు. ఈ క్రమంలో తను కూడా 44 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ని గెలిపించాడు. మొత్తానికి 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 206 పరుగులు చేసి ఆర్సీబీ లక్ష్యాన్ని అతి వేగంగా సాధించింది.

గుజరాత్ బౌలింగులో సాయి కిషోర్ మాత్రమే ఒక్క వికెట్ తీసుకున్నాడు. మిగిలినవాళ్లందరూ విరివిగా పరుగులు సమర్పించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ కి ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేదు. వ్రద్ధిమాన్ సాహా (5) త్వరగా అయిపోయాడు. కెప్టెన్ గిల్ కూడా కేవలం 16 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ మాత్రం జట్టు పరువు కాపాడాడు 49 బంతుల్లో 4 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read: T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టీమ్స్ ఇవే..

తర్వాత షారూఖ్ ఖాన్ కూడా ధనాధన్ ఆడాడు. 30 బంతుల్లో 5 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చేతిలో వికెట్లు ఉన్నా షాట్లు కొట్టడానికి బ్యాటర్లు ప్రయత్నించకపోవడంతో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల వద్ద ఆగిపోయింది.

ఆర్సీబీ బౌలింగులో స్వప్నిల్ సింగ్ 1, సిరాజ్ 1, గ్లెన్ మ్యాక్స్ వెల్ 1 వికెట్లు పడగొట్టారు.

ఎంత గెలిచినా ఆర్సీబీ ఇంకా అట్టడుగు ప్లేస్ నుంచి బయటపడటం లేదు. ఇదే 6 పాయింట్లతో తన పైన ముంబయి, పంజాబ్ ఉన్నాయి. వాటిని దాటి, ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే, మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×