BigTV English

IPL 2024 Match 1: CSK Vs RCB: మొదటి ఐపీఎల్ మ్యాచ్.. టాస్ కీలకం..!

IPL 2024 Match 1: CSK Vs RCB: మొదటి ఐపీఎల్ మ్యాచ్.. టాస్ కీలకం..!
IPL 2024 Match 1 Chennai Super Kings vs Royal Challengers Bengaluru
IPL 2024 Match 1 Chennai Super Kings vs Royal Challengers Bengaluru

IPL 2024 Match 1 – CSK Vs RCB: మరికొద్దిగంటల్లో ఐపీఎల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైపోతోంది. అయితే రాత్రి 8గంటలకు తొలిమ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే అందరిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ టాస్ ప్రధాన పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఎవరైతే మొదట బ్యాటింగ్ చేస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛేజింగ్ చేసేవారికి బ్యాటింగ్ కష్టమే అంటున్నారు. ఎందుకంటే స్పిన్ వేగంగా తిరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


మ్యాచ్ జరిగే శుక్రవారం అయితే వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైలోని కొద్ది ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి. కానీ మ్యాచ్ రోజు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు. మ్యాచ్ వేళల్లో ఉష్ణోగ్రతలు 30 డగ్రీల వరకు ఉండవచ్చునని అంటున్నారు.

చెన్నై పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెంటికి అనుకూలిస్తుందని అంటున్నారు. మొదట బ్యాటర్లకు అనుకూలంగా కనిపించే పిచ్ క్రమంగా స్పిన్ కు టర్న్ అవుతుందని అంటున్నారు. ఇలా చూస్తే ఛేజింగ్ చేసే జట్టుకి ప్రమాదకరమేనని అంటున్నారు. స్పిన్ తిరిగే సమయంలో కరెక్టుగా స్పిన్ తిప్పే బౌలర్ క్లిక్ అయితే, వరుసపెట్టి వికెట్లు పడటం ఖాయమని అంటున్నారు.


Also Read: ధనాధన్ ఐపీఎల్ పండుగొచ్చింది.. నేడే ఘనంగా ప్రారంభం

ఈ లెక్మన చూస్తే మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంతేకాదు రాత్రి వేళలో మంచు ఎక్కువగా కురిస్తే మాత్రం స్పిన్నర్లు చెలరేగిపోతారని అంటున్నారు. సీఎస్కేతో పోల్చి చూస్తే ఆర్సీబీకి విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈ రెండు జట్లు దాదాపు 31 సార్లు పోటీ పడ్డాయి. సీఎస్కే 20 సార్లు, ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. చెన్నై స్టేడియంలో అయితే ఈ రెండు జట్లు 8 సార్లు తలపడ్డాయి. సీఎస్కే ఏడుసార్లు విజయం సాధించింది. అయితే అదంతా ధోనీ మహిమ అంటున్నారు. ఆర్సీబీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

Tags

Related News

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

AFG vs PAK: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన అప్ఘానిస్తాన్…ద్వైపాక్షిక సిరీస్ లు ర‌ద్దు…షేక్ హ్యాండ్ లు కూడా ర‌ద్దు !

IND VS WI: 518-5 వ‌ద్ద‌ టీమిండియా డిక్లేర్డ్…గిల్ భయంక‌ర సెంచ‌రీ, WTCలో చ‌రిత్ర‌

Big Stories

×