Big Stories

KKR vs PBKS: భల్లే.. భల్లే.. రికార్డుల మోత మోగించిన పంజాబ్ కింగ్స్..!

IPL 2024 KKR vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్ లో అద్భుతమే జరిగింది. ఇక అయిపోయింద్రా అనుకున్నవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న జట్లు జూలు విదలిస్తున్నాయి. గురువారం ఆర్సీబీ కూడా ఎదురులేని హైదరాబాద్ ను ఓడించి ఔరా అనిపించింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా ధనాధన్ ఆడి తనేమిటో నిరూపించింది.

- Advertisement -

వీరు గాని రేపటి నుంచి ఇలా ఆడితే ప్రత్యర్థులను తట్టుకోవడం కష్టమేనని చెప్పాలి. ఇకపోతే కోల్ కతా వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పలు నయా రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాయి.

- Advertisement -

ముందుగా చెప్పాలంటే ఐపీఎల్ హిస్టరీలో తొలిసారిగా 261 పరుగుల టార్గెట్ ను ఛేదించారు. ఐపీఎల్ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ ఇంత ఛేజింగ్ జరగడమని చెబుతున్నారు. ఇంతకు ముందు 2020, 2024లో రాజస్థాన్ రాయల్స్ 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2021లో ముంబై ఇండియన్స్ 219 పరుగుల టార్గెట్ ని ఛేదించింది.

మరో రికార్డ్ ఏమిటంటే రెండు జట్ల నుంచి నలుగురు ఓపెనర్లు ఒకే మ్యాచ్ లో అర్థ శతకాలు సాధించారు. ఇది ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ జరిగింది. వీటన్నింటికి మించి ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు 24 పంజాబ్ కింగ్స్ కొట్టారు. ఒక జట్టు ఇలా ఏకపక్షంగా కొట్టడం ఇదే ఫస్ట్ టైమ్ గా చెబుతున్నారు.

ఓవరాల్ గా మొత్తం 42 సిక్సర్లు నమోదైన తొలి మ్యాచ్ గా నిలిచింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జానీ బెయిర్ స్టో నిలిచాడు. మొత్తానికి ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ ఒక స్థానం ఎగబాకింది. 9 నుంచి 8కి వెళ్లింది. కోల్ కతా ఓడినా సరే, తన ప్లేస్ లో మార్పు రాలేదు. ముంబై మాత్రం 9కి పడిపోయింది. దానికిందనే ఆర్సీబీ ఉంది.

Also Read: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హిస్టరీ.. పోరాడి ఓడిన కోల్ కతా

పంజాబ్ బౌలర్ హర్షల్ వద్దకు పర్పుల్ క్యాప్ చేరే అవకాశాలున్నాయి. తను 14 వికెట్లతో అందరికన్నా ముందున్నాడు. ఇక బ్యాటర్లలో చూస్తే రేసులోకి సునీల్ నరైన్ (357 పరుగులు) వచ్చాడు. అయితే మొదటి నుంచి విరాట్ కోహ్లీ ముందంజలోనే ఉన్నాడు. ప్రస్తుతం 430 పరుగులతో తన గేమ్ తను ఆడుతూ వెళుతున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News