BigTV English

RCB Vs DC Match Highlights: తాను ఓడి.. ఆర్సీబీకి ఊపిరిపోసిన ఢిల్లీ..!

RCB Vs DC Match Highlights: తాను ఓడి.. ఆర్సీబీకి ఊపిరిపోసిన ఢిల్లీ..!

IPL 2024 62nd Match – Royal Challengers Bangalore Vs Delhi Capitals Highlights: అయ్యయ్యో ఢిల్లీ ఎంత పని చేసింది. ఆర్సీబీపై గెలిచి ఉంటే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఆ జట్టుని ప్లే ఆఫ్ రేస్ లోంచి పక్కకు నెట్టేసేది. అలాగే తను 14 పాయింట్లతో బెటర్ గా ఉండేది. ఇంకో మ్యాచ్ చేతిలో ఉండేది. అది కూడా గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్ రేస్ లోకి వెళ్లిపోయేది. ఇప్పుడు ఓడి, సమస్యను పీకలమీదకు తెచ్చుకుంది. అంతేకాదు ఆర్సీబీకి ఊపిరి పోసింది.


స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ నిషేధానికి గురైన కెప్టెన్ రిషబ్ పంత్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగింది. దీంతో తన బదులు అక్షర్ పటేల్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.

విషయానికి వస్తే.. ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మధ్య  బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో  మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 140 పరుగులకి ఆలౌట్ అయ్యి, 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.


Also Read: IPL 2024 DC vs LSG Match Preview: ఢిల్లీ గెలుస్తుందా? నిలుస్తుందా..? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్..!

వివరాల్లోకి వెళితే.. 188 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బ్యాటింగ్ మొదలు పెట్టింది. శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1) ఇలా వచ్చి అలా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జాక్ ఫ్రేజర్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత అభిషేక్ పోరెల్ (2), కుమార్ కుశాగ్రా (2) వెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు.

కాకపోతే తాత్కాలిక కెప్టెన్ గా వచ్చిన అక్షర్ పటేల్ మాత్రం పోరాడాడు. షై హోప్ (29) సాయంతో మ్యాచ్ ని ముందుకు తీసుకువెళ్లాడు. అలా 39 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తను ఉన్నంత వరకు మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోనే ఉంది. తను అవుట్ అయ్యాక చేజారిపోయింది.

Also Read: IPL 2024 GT vs KKR: ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ అవుట్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు..

తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (3), రశిఖ్ (10), కులదీప్ యాదవ్ (6), ముఖేష్ కుమార్ (3) ఇలా వచ్చి అలా అయిపోయారు. దీంతో 19.1 ఓవర్లలోనే 140 పరుగులకు ఆలౌట్ అయ్యారు. చివరికి 47 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులారా ఓడిపోయారు.

ఆర్సీబీ బౌలింగ్‌లో స్వప్నిల్ 1, సిరాజ్ 1, యష్ దయాల్ 3, ఫెర్గ్యూసన్ 2, కామెరూన్ గ్రీన్ 1 వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.  కెప్టెన్ డుప్లెసిస్ (6) త్వరగా అయిపోయాడు. కాసేపటికే కొహ్లీ (27) అవుట్ అయ్యాడు. అప్పుడు ఫస్ట్ డౌన్ వచ్చిన విల్ జాక్స్ 29 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు.

Also Read: IPL 2024 Playoffs Scenario: ఆర్సీబీకి అవకాశాలు ఉన్నట్టా? లేనట్టా?

రజత్ పటీదార్ ఎప్పటిలా ఆఫ్ సెంచరీ చేశాడు. కాకపోతే క్రీజులో నిలదొక్కుకున్నాక భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నాడు. ఇది తనకి బలహీనతగా మారుతోంది. మొత్తానికి ఒక క్లిష్టమైన సమయంలో వచ్చి మ్యాచ్ ని  నిలబెట్టాడని చెప్పాలి. 32 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు.

తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక దశలో భారీ స్కోరు చేస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే 12.3 ఓవర్ల సమయానికి 3 వికెట్లకు 124 పరుగులు చేసి మంచి పటిష్టమైన స్థితిలో ఉంది. చేతిలో ఇంకా 7.3 ఓవర్లు ఉన్నాయి. ఏవరేజ్ ను ఓవర్ కి 10 పరుగులు చేసినా దగ్గర దగ్గర 80 పరుగులు వచ్చేవి. స్కోరు డబుల్ సెంచరీ దాటేది.

Also Read: తేలిపోయిన రాజస్థాన్.. ప్లే ఆఫ్‌కు చేరువలో చెన్నై..

కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోయారు. మొత్తానికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. ఢిల్లీ ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉంది. సుమారు నాలుగు కీలక బ్యాటర్ల క్యాచ్ లు చేతులోకి వచ్చినవి వదిలేశారు. దానికి మూల్యమే నేటి ఓటమి అని చెప్పాలి. అదే ఆర్సీబీ ఫీల్డర్లు అయితే అద్భుతంగా క్యాచ్ లు పట్టారు. మ్యాచ్ ని గెలిపించారు. ఈ రెండు జట్ల మధ్య గెలుపును చూస్తే ఫీల్డింగు బాగా చేసిన ఆర్సీబీ గెలిచిందని చెప్పాలి.

ఢిల్లీ బౌలింగులో ఇషాంత్ శర్మ 1, ఖలీల్ అహ్మద్ 2, ముఖేష్ కుమార్ 1, కులదీప్ 1, రశిఖ్ 2 వికెట్లు పడగొట్టారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×