BigTV English

MI Vs LSG Match Preview: ముంబై ఆఖరి పోరాటం.. ‌నేడు లక్నో సూపర్ జెయింట్స్‌‌తో మ్యాచ్!

MI Vs LSG Match Preview: ముంబై ఆఖరి పోరాటం.. ‌నేడు లక్నో సూపర్ జెయింట్స్‌‌తో మ్యాచ్!

IPL 2024 67th Match – Mumbai Indians Vs Lucknow Super Giants Preview: ఎలాంటి ముంబై ఎలా అయిపోయింది? ఐదు ట్రోఫీలు కొట్టిన ముంబై, ఐపీఎల్ లో కింగ్ లా ఉండేది, నేడు బొంగులా అయిపోయిందని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అట్టడుగు స్థానంలో కొట్టుమిట్టాడుతున్న ముంబై ఐపీఎల్ 2024 సీజన్ లో తన ఆఖరి మ్యాచ్ లక్నోతో ఆడనుంది. రాత్రి 7.30 గంటలకు ముంబై వాంఖేడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.


రెండు జట్లకి ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. లక్నో 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ముంబై 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉండిపోయింది. అయితే ఇంతవరకు రెండు జట్ల మధ్య 5 మ్యాచ్ లు జరిగాయి. ముంబై ఒకటి గెలిస్తే, లక్నో నాలుగింట విజయం సాధించింది.

ముంబై విషయానికి వస్తే అతిరథ మహారథులు అందరూ జట్టులోనే ఉన్నారు. కానీ ఎవరూ అక్కరకు రావడం లేదు. జాతీయ జట్టులో ఆడే నలుగురు టాప్ ప్లేయర్స్ లో ఒకరైన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీ 20 స్పెషలిస్ట్ సూర్యకుమార్, ఆల్ రౌండర్ కమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఇలా అందరూ ఉండి కూడా అట్టడున ఉందంటే ఆశ్చర్యం అనిపించక మానదు.


Also Read: రిటైర్మెంట్ తర్వాత నేను మీకు కనిపించను.. విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్

కేవలం పాండ్యాని కెప్టెన్ గా ఎంపిక చేయడం జట్టుకి ఇష్టం లేక, ఎవరూ మనస్ఫూర్తిగా ఆడలేదని అంటున్నారు. వచ్చే ఏడాది భారీ వేలం పాట ఉండటంతో, ముంబై జట్టులో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరనేది తేలిపోనుంది. బహుశా రోహిత్ శర్మ బయటకు వస్తాడని అంటున్నారు. ఇక 2024 సీజన్ మాత్రం ముంబైకి ఒక పీడకలగా మిగిలిపోనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ముంబైకి దగ్గరగానే ఉంది. అంటే వాళ్లు కనీసం 6 మ్యాచ్ లు గెలిచారు. ఫ్రాంచైజీ ఓనర్ సంజయ్ గొయెంకా ఓవరాక్షన్ కారణంగా కేఎల్ రాహుల్ తీరని అవమానాన్ని పొందాడు. ఏ క్రికెటర్ కి ఎదురుకాని అనుభవాన్ని చవి చూశాడు.

Also Read: ఆర్సీబీకి సవాల్ : 18 పరుగులు.. లేదా 18.1 ఓవర్ లో గెలవాలి

బహుశా తను కూడా వచ్చే ఏడాది లక్నోకి ఆడకపోవచ్చుననే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్నో మనసుపెట్టి ఆడుతుందంటే డౌటే అని అంటున్నారు. మరేం జరుగుతుందో నేటి మ్యాచ్ లో చూడాల్సిందే.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×