BigTV English

SRH Vs GT Match Abandoned: మ్యాచ్ వర్షార్పణం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్.. సంబరాల్లో ఫ్యాన్స్!

SRH Vs GT Match Abandoned: మ్యాచ్ వర్షార్పణం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్.. సంబరాల్లో ఫ్యాన్స్!

IPL 2024 66th Match – Sunrisers Hyderabad Vs Gujarat Titans Abandoned due to Rain: అనుకున్నంతా అయ్యింది. హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ టాస్ పడకుండానే వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో రెండు జట్లకి చెరొక పాయింట్ లభించింది. దీంతో ఆడకుండానే హైదరాబాద్ ప్లే ఆఫ్ కి చేరిపోయింది. ఇక 12 పాయింట్లతో గుజరాత్ 8వ స్థానంలో ఆగిపోయింది.


ముందుగా అందరూ అంచనా వేసినట్టు హైదరాబాద్ లో వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. అయితే మధ్యలో కాసేపు వరుణుడు శాంతించాడు. దాంతో కనీసం 5 ఓవర్లు అయినా మ్యాచ్ నిర్వహిద్దామని నిర్వాహకులు అనుకున్నారు. సుమారు వంద మంది స్టేడియం సిబ్బంది అలుపెరగకుండా శ్రమించారు.

అవుట్ ఫీల్డ్ అంతా సిద్ధం చేశాక…మళ్లీ రయ్ మని వర్షం కురిసింది. అప్పటివరకు సిద్ధం చేసినదంతా పోయింది. దీంతో రాత్రి 10.30 వరకు అంపైర్లు చూశారు. అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారిపోయింది. ఆటగాళ్లకు ప్రమాదాలు జరుగుతాయని భావించి మ్యాచ్ ని రద్దు చేశారు. చెరొక పాయింట్ కేటాయించారు. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో హాజరైన అభిమానులు.. వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు.


Also Read: రిటైర్మెంట్ తర్వాత నేను మీకు కనిపించను.. విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్

ముఖ్యంగా లోయర్ స్టాండ్స్‌‌లోని ప్రేక్షకులకు రక్షణ లేకపోవడంతో మొత్తం తడిసిపోయారు. రద్దు చేసిన తర్వాత తిరిగి వెళుతూ చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ రోడ్ల మీద పడి, బస్సుల వెనుక పరుగులు పెట్టారు. మెట్రో స్టేషన్లలోకి పరుగులు తీశారు. ఇంక కార్లు, బైకుల మీద వచ్చినవాళ్లు ట్రాఫిక్ జామ్ కావడంతో నానా అగచాట్లు పడ్డారు. మొత్తానికి సరదా తీరిపోయిందని చాలా మంది కామెంట్లు పెట్టారు.

మరోవైపు మ్యాచ్ రద్దయినా… ప్లే ఆఫ్ కి చేరామనే సంతోషాన్ని సన్‌రైజర్స్ ఆటగాళ్లు, అభిమానులు వ్యక్తం చేశారు. ఇకపోతే పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌‌లో విజయం సాధిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-2 బెర్త్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. అటువైపు రాజస్థాన్ వరుసగా ఐదో మ్యాచ్ కూడా ఓడిపోతేనే అది సాధ్యమవుతుంది. ఆదివారం నాడు కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×