BigTV English

IPL 2024 Opening Ceremony Highlights: ఐపీఎల్ సంబరాల్లో రెహ్మాన్ ఆర్కెస్ట్రా.. అక్షయ్ ఆట సోనూ పాట..!

IPL 2024 Opening Ceremony Highlights: ఐపీఎల్ సంబరాల్లో రెహ్మాన్ ఆర్కెస్ట్రా.. అక్షయ్ ఆట సోనూ పాట..!
IPL 2024 Opening Ceremony
IPL 2024 Opening Ceremony

IPL 2024 Opening Ceremony Highlights: మరి కొద్ది సేపట్లో ఐపీఎల్ సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. అందరూ ఎంతో ఉత్కంఠగా ప్రారంభోత్సవ వేడుకలు చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అందరికీ శుభవార్త ఏమిటంటే, ఐపీఎల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమైతే, సంబరాలు మాత్రం సాయంత్రం 6.30 నుంచి ప్రారంభం కానున్నాయి.


ఈ సంబరాల్లో సంగీత ప్రభంజనం ఏఆర్ రెహ్మాన్ ఆర్కెస్ట్రా మోత మోగిపోనుంది. అంతేకాదు హీరో అక్షయకుమార్, టైగర్ ష్రాఫ్ నృత్యాలు చేయనున్నారు. ఇక సోనూ నిగమ్ పాటలతో అలరించనున్నాడు. వేడుకలకు చెన్నైలోని చెపాక్ స్టేడియం ముస్తాబైంది.

ఏఆర్ రెహ్మాన్ ఆర్కెస్ట్రాలో బాలీవుడ్ పాటలతో పాటు, దేశభక్తి పాటలు కూడా పాడనున్నారు. ఐపీఎల్ ఎక్స్ అఫీషియల్ సైట్ లో ఒక క్యాప్షన్ పెట్టారు. వేదిక సిద్ధమైంది. కోటి కాంతుల వెలుగు జిలుగుల సమ్మేళనంలో స్టార్టు ప్రదర్శనకు సిద్ధమయ్యారు. అని రాసుకొచ్చింది.


Also Read: Match 1 CSK vs RCB: మొదటి ఐపీఎల్ మ్యాచ్.. టాస్ కీలకం..

అంతా బాగుంది కానీ, స్టార్ హీరోయిన్లు ఎవరూ రాకపోవడంతో అభిమానులు చప్పగా ఫీలవుతున్నారు. ఎవరో ఒకరు పూజాహెగ్డే, దీపికా, కైరా అద్వానీ, తమన్నా, శ్రద్ధా కపూర్ ఇలా ఎంతోమంది ఉంటే, ఒక్కరినీ పిలవలేదని పాపం చాలామంది చెప్పలేక చెప్పలేక నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. ఏదో సప్పగా ఉండేలా ఉందే ప్రోగ్రాం… అంటూ నర్మగర్భంగా రాసుకొస్తున్నారు. అదండీ సంగతి…

2023లో చూస్తే తమన్నా, రష్మికా మందాన వచ్చి తమ అందచందాలతో హడావుడి చేశారు.
2020లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అనుష్క శర్మ తమ అభినయంతో అభిమానులను అలరించారు.
2018లో అయితే హ్రతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ప్రభుదేవా, వరుణ్ ధావన్ వీరందరూ వచ్చి హంగామా చేశారు.
2017లో చూస్తే బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్, సింగర్ మోనాలి ఠాకూర్ వచ్చారు.
2016లో చూస్తే ఎప్పటిలా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వచ్చి ఆడి పాడి అలరించింది.

మరిప్పుడు కూడా ఇలా ఎవరినైనా తీసుకువచ్చి సడన్ సర్ ప్రైజ్ చేస్తారా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×