Big Stories

New Twist in Vizag Drugs Case: సంధ్య ఆక్వా కంపెనీపై సీబీఐ దాడులు.. ఇది డ్రగ్ కాదు.. రొయ్యల కోసమే!

CBI RAIDS ON SANDHYA AQUA COMPANY AT KAKINADA
CBI RAIDS ON SANDHYA AQUA COMPANY AT KAKINADA

Twist in Vishaka Drugs Case: విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి పెట్టింది సీబీఐ. లభించిన సమాచారం ఆధారంగా కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్ పోర్టు ఆఫీసులో సోదాలు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచి ఏడుగురు అధికారుల బృందం వివిధ విభాగాల్లో తనిఖీలు చేపట్టింది. కూలీల రికార్డులను పరిశీలించింది. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. అలాగే అక్కడున్న ల్యాబ్ ను పరిశీలించింది. పలు అనుమానాలు రావడంతో విశాఖ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ టీమ్ ని రప్పించింది. సేకరించిన శాంపిల్స్ ను ఆ టీమ్ తీసుకెళ్లింది. ఈ కంపెనీతో వ్యాపార భాగస్వామిగా ఉన్న మిగతా వాటిపై ఫోకస్ చేసింది సీబీఐ.

- Advertisement -

మరోవైపు డ్రగ్ కంటైనర్ పై సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వివరణ ఇచ్చుకుంది. రొయ్యల మేతలో వాడే ఈస్ట్ ను తొలిసారి బ్రెజిల్ కు ఆర్డర్ ఇచ్చామని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హరి తెలిపారు. తక్కువ రేట్ కు మంచి క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండడంతో ఐసీసీ – బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్ లో డబ్బు చెల్లించినట్టు తెలిపారు.

- Advertisement -

Also Read: Vontimitta Crime : భార్య, కూతురిని చంపి చేనేత కార్మికుడి ఆత్మహత్య.. అతనే కారణమంటూ..

జనవరి 14 న బ్రెజిల్ శాంతోస్ పోర్ట్ లో బయలుదేరిన మార్చి 16న విశాఖ కంటెనర్ వచ్చిందన్నారు డైరెక్టర్ హరి. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ సమక్షంలో కంటైనర్ ఓపెన్ చేసి డ్రగ్ టెస్ట్ చేశారని తెలిపారు. అయితే దీన్ని నిషేధిత డ్రగ్ గా సీబీఐ అనుమానిస్తోంది. ఐసీసీ బ్రెజిల్ మాత్రం ఎలాంటి నిషేధిత డ్రగ్ సరఫరా చేయలేదని, నిరూపించడానికి సిద్దమేనని చెబుతోంది. ఇంకా టెస్ట్ లు జరగాల్సి ఉందని, మా ప్రమేయం ఏమీ లేదని విచారణకు సహకరిస్తామన్నారు. అయితే రాజకీయాల కోసం పార్టీలు ఈ ఇష్యూ వాడుకోవడం విచారకరమన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News