E-Paper
Advertisement

Who is Nitish Kumar Reddy: ఎవరీ నితీశ్ రెడ్డి..? తెలుగు కుర్రాడి ప్రస్థానం ఇదే..!

Who is Nitish Kumar Reddy: ఎవరీ నితీశ్ రెడ్డి..? తెలుగు కుర్రాడి ప్రస్థానం ఇదే..!
Advertisement

Telugu Cricketer Nitish Kumar Reddy In Sunrisers Hyderabad: హైదరాబాద్ సన్ రైజర్స్ లో తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ లో యోధాను యోధులందరూ ఒకరి తర్వాత ఒకరు తనకళ్ల వెంటే వెళ్లిపోతుంటే, ఎక్కడా తత్తరపడలేదు, బిత్తరపడలేదు.

మొదట్లో స్లో గా ఆడిన నితీశ్.. తర్వాత బ్యాట్ ఝులిపించాడు. తెలుగు పవర్ రుచి చూపించాడు. ఇలా 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి, హైదరాబాద్ గెలిచే స్థాయికి తీసుకొచ్చాడు. అవే లేకపోతే చివర్లో పంజాబ్ కింగ్స్ దూకుడికి హైదరాబాద్ ఓటమి పాలయ్యేది. అంతేకాదండోయ్ బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు.

Advertisement

విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి. 2003లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‍లో ఆల్ రౌండర్ గా ఎదిగిన నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 17 రంజీ మ్యాచ్‍ల్లో 566 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేస్ బౌలింగ్ వేసే నితీశ్ 52 వికెట్లు పడగొట్టాడు. ఇక, లిస్ట్-ఏ క్రికెట్‍లో 22 మ్యాచ్‍ల్లో 403 పరుగులు, 14 వికెట్లు తీసుకున్నాడు.

Also Read: Nitish excellent performance: కుమ్మేసిన వైజాగ్ కుర్రాడు నితీశ్.. ప్రపంచకప్‌ టోర్నీకి ఛాన్స్..?

Advertisement

ఆంధ్రప్రదేశ్ తరఫున వివిధ ఏజ్ గ్రూప్‍ల్లో ఆడుతూ ఒకొక్క మెట్టు ఎక్కూతూ ఐపీఎల్ వరకు వచ్చాడు . ఇంకా బీసీసీఐ కంట్లో పడలేదు. ఇదిగో ఈరోజు మ్యాచ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎవరీ కుర్రాడు అనుకునేలా ఆడాడు.

ఇలా మరో రెండు మూడు మ్యాచ్ లు ఆడి, గేమ్ ఛేంజర్ గా మారితే, తప్పక టీమ్ ఇండియాలో చోటు దక్కుతుందని అప్పుడే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సీఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్ లా ప్రతి ఏడాది అద్భుతంగా ఆడగలిగి, తను జట్టులో నమ్మదగ్గ ఆల్ రౌండర్ గా నిరూపించుకోగలిగితే నితీశ్ కి తిరుగుండదని అంటున్నారు. 2020లో రంజీల్లో ఆంధ్రా తరఫున అడుగుపెట్టి, గత నాలుగేళ్లుగా దేశవాళీ క్రికెట్‍లో నిలకడగా రాణిస్తున్నాడు.

Also Read: Hardik and Krunal Pandya: పాండ్యా బ్రదర్స్ మోసపోయారు..

ఐపీఎల్ 2023 సీజన్ ముందు జరిగిన వేలంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నితీశ్ కుమార్‌ను రూ.20లక్షలకు కొనుక్కుంది. గత సీజన్‍లో రెండు మ్యాచ్‍లు ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‍లో రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ 2024 లో తన ప్రతాపాన్ని చూపించాడు.

ఐపీఎల్‍లో తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ గెలిపించాడు. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ 2 పరుగులతో గెలిచినా, అవే జట్టుకి ఊపిరిపోశాయని చెప్పాలి.

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×