EPAPER

RR vs DC: స్టబ్స్, వార్నర్ పోరాటం వృథా.. ఢిల్లీతో పోరులో రాజస్థాన్ విజయం..

RR vs DC: స్టబ్స్, వార్నర్ పోరాటం వృథా.. ఢిల్లీతో పోరులో రాజస్థాన్ విజయం..
Rajasthan Royals vs Delhi Capitals
Rajasthan Royals vs Delhi Capitals

Rajasthan Royals vs Delhi Capitals: జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో  రాజస్థాన్ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టబ్స్(44*), వార్నర్(49) పోరాడినా ఫలితం దక్కలేదు. 186 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.


186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 12 బంతుల్లోనే 23 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో రికీ భుయ్ డకౌట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.

కెప్టెన్ పంత్, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆచితూచి ఆడారు. 49 పరుగుల చేసినన వార్నర్ అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 28 పరుగులు చేసిన పంత్ చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 105 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్ పోరెల్ ఈ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో చివరి 4 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి వచ్చింది. 16వ ఓవర్లో స్టబ్స్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టడంతో చివరి 3 ఓవర్లో విజయ సమీకరణం 41 పరుగులుగా మారింది.


అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో కేవలం 9 తొమ్మిది పరుగలే వచ్చాయి. దీంతో చివరి రెండు ఓవర్లలో 32 పరుగులుగా విజయ సమీకరణం మారింది. 19వ ఓవర్ తొలి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి.

అంతకుముందు రియాన్ పరాగ్(84*, 45 బంతుల్లో 7X4, 6X6) చెలరేగడంతో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నోకియా వేసిన 20వ ఓవర్లో 4,4,6,4,6,1 బాదాడు. దీంతో చివరి ఓవర్లో రాజస్థాన్ 25 పరుగులు రాబట్టింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ముఖేశ్ కుమార్ యశస్వి జైశ్వాల్(5)ను బౌల్డ్ చేశాడు. ఆరో ఓవర్లో కెప్టెన్ సాంసన్(15) అవుట్ అవ్వడంతో పవర్ ప్లే ముగిసేలోపు రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు మాత్రమే చేసింది. 8వ ఓవర్లో మరో ఓపెనర్ జాస్ బట్లర్(11) ఎల్బీగా వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేలోపు రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు మాత్రమే చేసింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పరాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అశ్విన్(29)తో నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన రియాన్ పరాగ్.. ధృవ్ జురెల్(20)తో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Tags

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×