Big Stories

Gangster Mukhtar Ansari Died: గుండెపోటుతో యూపీ గ్యాంగ్‌స్టర్‌ మృతి.. అక్కడ 144 సెక్షన్‌ అమలు

gangster mukhtar ansari
gangster mukhtar ansari

Gangster Mukhtar Ansari Died with Heart Attack: గుండెపోటుతో యూపీకి చెందిన ప్రముఖ గ్యాంగ్ స్టర్ మృతి చెందాడు. గ్యాంగ్ స్టర్ నుంచి పొలిటీషియన్‌గా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ బాందా జైలులో శిక్ష అనుభవిస్తూనే తుది శ్వాస విడిచాడు. ఈ మేరకు అన్సారీ మృతికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను అధికారులు విడుదల చేశారు. బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ.. గురువారం సాయంత్రం 8.25లకు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. అంతేకాదు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నాడని.. అనంతరం స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే అన్సారీ కన్నుమూసినట్లు మెడికల్ బులిటెన్ లో స్పష్టం చేశారు.

- Advertisement -

అన్సారీ రెండు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరినట్లు ఆయన సోదరుడు, ఘాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ తీవ్ర ఆరోపణలు చేశారు. అనారోగ్యంతో కోలుకుని తిరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపారు. అయితే జైలులోనే తన సోదరుడు అన్సారీకి విషపూరితమైన ఆహారం ఇచ్చినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ముఖ్తార్ ఆరోగ్యం బాలేక బాత్రూంలో పడిపోయారని జైలు అధికారులు వెల్లడించారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

144 సెక్షన్..

గ్యాంగ్ స్టర్, పొలిటీషియన్ అన్సారీ మృతితో పోలీసులు అప్రత్తమయ్యారు. ఈ నేపథ్యంలో యూపీలో 144 సెక్షన్ అమలు చేశారు. గ్యాంగ్ స్టర్ మృతితో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారణాసి, బాందా, మౌ, ఘాజీపుర్ జిల్లాల్లో భారీగా పోలుసు బలగాలు ఇప్పటికే చేరుకున్నాయి. సెంట్రల్ రిజర్వ్ బలగాలు కూడా మోహరించినట్లు తెలిపారు. ఈ మేరకు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ ఈ బాధ్యతలు స్వీకరించారు.

Also Read: నా భర్తను వేధిస్తున్నారు.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.. సునీతా కేజ్రీవాల్

అన్సారీపై 61 కేసులు

ముఖ్తార్ అన్సారీ ఒక ప్రముఖ గ్యాంగ్ స్టర్ మాత్రమే కాదు ఆయన ఒక పొలిటీషియన్ కూడా. ఆయన దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అన్సారీ యూపీలోని మౌకు చెందిన వ్యక్తి. అన్సారీపై 15 హత్య కేసులు ఉండగా మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అన్సారీ 1980లో గ్యాంగ్ స్టర్ గా చేరి.. 1990లో సొంతంగా గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నారు.

2004లో అన్సారీ వద్ద ఓ మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అన్సారీపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాదు అన్సారీ వారణాసి, ఘాజీపుర్, మౌ లలో కిడ్నాపులు, దొంగతనాలకు పాల్పడేది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో ఏప్రిల్ 2023లో అన్సారీకి కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఆయనపై కోర్టు జీవిత ఖైదు కూడా విధించింది. బీఎస్పీ తరుపున 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యడు అన్సారీ. ఈ మేరకు ఆయన మృతి పట్ల బీఎస్పీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News