Gelenn Maxwell: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మళ్లీ ఆడతానంటూ సంచలన ప్రకటన చేశాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ( Gelenn Maxwell). తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్సీ మామ… ఈ సంచలన ప్రకటన చేశాడు. అంతేకాదు ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొనేందుకు తన పేరును… కనీస ధర రెండు కోట్లు పెట్టి రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన… కార్యక్రమాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి.
ఈ సారి రిటెన్షన్ ప్రక్రియ… అలాగే మెగా వేలం జరుగుతున్న నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంటు ఆరంభానికి ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ఈ నవంబర్ నుంచి హడావిడి కొనసాగుతోంది. అక్టోబర్ 31వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఒక్కో టీం తమకు కావాల్సిన ప్లేయర్లను అంటిపెట్టుకొని ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ క్రికెటర్ క్లాసెన్ 23 కోట్లు పలికాడు. అతనికి 23 కోట్లు ఇచ్చి మరి రిటైన్ చేసుకుంది హైదరాబాద్ ఓనర్ కావ్య పాప.
ఇటు టీమిండియా స్టార్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఆ జట్టు యాజమాన్యం ఏకంగా 21 కోట్లు ఇచ్చింది. అనూహ్యంగా బెంగళూరు జట్టులో.. స్టార్ క్రికెటర్లందరూ దూరమయ్యారు. కామరూన్ గ్రీన్, మ్యాక్సీ మామ, హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ క్రికెటర్లను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వదిలేసింది. దీంతో ఈసారి బెంగళూరు జట్టులోకి కొత్త ప్లేయర్లు రాబోతున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాక్సి మామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్ళీ బెంగళూరు జట్టుకు వస్తానేమో అంటూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాక్సిమామ. రిటెన్షన్ ప్రక్రియ కంటే ముందు ఆర్సిబి యాజమాన్యం తనను సంప్రదించిందని కూడా గుర్తు చేశాడు. రిటన్షన్ లో నిన్ను తీసుకోవడం లేదని ఆర్సిబి యాజమాన్యం తనకు చెప్పిందని… ఆ విషయంలో ఎలాంటి బాధపడకూడదని… యాజమాన్యం తెలిపిందని… తాజాగా మాక్సిమామా పేర్కొన్నాడు. ఈ విషయంలో అరగంట పాటు తనతో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మాట్లాడినట్టు వెల్లడించాడు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తన ప్రయాణం ముగిసిందని ఇప్పుడే చెప్పలేనని… వేలంలో తనను మళ్ళీ కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని కూడా అభిప్రాయపడ్డాడు. దీంతో ఆర్సిబి జట్టులోకి మళ్లీ మాక్సిమామ రాబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: IPL 2025: వేలంలోకి 42 ఏళ్ల అండర్సన్..రూ. 2 కోట్ల ప్లేయర్లు వీళ్లే ?
రిటెన్షన్ ప్రక్రియ కంటే ముందు ఆర్సిబి యాజమాన్యం తనను సంప్రదించిందని కూడా గుర్తు చేశాడు. రిటన్షన్ లో నిన్ను తీసుకోవడం లేదని ఆర్సిబి యాజమాన్యం తనకు చెప్పిందని… ఆ విషయంలో ఎలాంటి బాధపడకూడదని… యాజమాన్యం తెలిపిందని… తాజాగా మాక్సిమామా పేర్కొన్నాడు. ఈ విషయంలో అరగంట పాటు తనతో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మాట్లాడినట్టు వెల్లడించాడు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తన ప్రయాణం ముగిసిందని ఇప్పుడే చెప్పలేనని… వేలంలో తనను మళ్ళీ కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని కూడా అభిప్రాయపడ్డాడు. దీంతో ఆర్సిబి జట్టులోకి మళ్లీ మాక్సిమామ రాబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.