Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణి కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే ఇండిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు దారుణంగా ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలి మ్యాచ్లో 7 వికెట్లు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది.
Also Read: RCB VS KKR: బౌలింగ్ ఎంచుకున్న RCB…డేంజర్ ప్లేయర్లతో రంగంలోకి KKR
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. అతని ఫ్యాన్ గ్రౌండ్ లోకి తీసుకువచ్చాడు. వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ… కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగానే గ్రౌండ్లోకి దూసుకు వచ్చాడు. ఈ తరుణంలోనే కోహ్లీ కాళ్ల పై పడి.. సాష్టాంగ నమస్కారాలు చేశాడు సదరు అభిమాని. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది… వెంటనే అతన్ని అక్కడ నుంచి లాక్కుని వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీన్ని చూసిన కోహ్లీ ఫ్యాన్స్,.. సంబరపడిపోతున్నారు. మరి కొంతమంది మాత్రం ఈడెన్ గార్డెన్స్ లో భద్రతా లోపం… స్పష్టంగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ). ఈ తరుణంలోనే మొదట బ్యాటింగ్ కు దిగింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు… కేవలం 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోవడంతో…. తక్కువ స్కోరుకే పరిమితమైంది కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో డేంజర్ ఆటగాడు సునీల్ నరైన్ 44 పరుగులు చేయగా… అజింక్య రహానే 56 పరుగులు చేశాడు.
కొత్త కుర్రాడు రఘువంశీ 30 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక మిగతా ప్లేయర్లు పెద్దగా రానించకపోవడంతో… కేకేఆర్ కు తీవ్ర నష్టం జరిగింది. అయితే… కేకేఆర్ ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. 16.2 ఓవర్ లోనే మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించి మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ( Royal Challengers Bangalore ) సాల్ట్ 56 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 59 పరుగులతో దుమ్ము లేపాడు. చివర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ 34 పరుగులతో రాణించాడు. అయితే కోహ్లీ ( Virat Kohli ) చివరి వరకు ఉండి మ్యాచ్ను గెలిపించాడు.
Also Read: Rohit Sharma – MS Dhoni: ధోనిని అవమానించిన రోహిత్… వీడియో వైరల్ !
Moment Of The Match ❤️
A Fan Branches Everything For Virat Kohli And Touches His Feet What A Madness As A Fan Pure Kattar Kolhi Supporter 🥺❤️..#ViratKohli𓃵 | #KKRvRCB pic.twitter.com/6bcZ6eer3H
— Harsh 17 (@harsh03443) March 22, 2025