Intinti Ramayanam Today Episode March 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పార్వతి గుడికి వెళ్తారు అక్కడ భరత్ ని చూసి రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెంచుకుంటుంది. భరత్ ని నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కూతురు ఎందుకు మోసం చేశావు ఆస్తి కోసమేనా చేసావా అంటూ దారుణంగా కొడతాడు రాజేంద్రప్రసాద్. అయితే అవని వచ్చి మధ్యలో ఆపుతుంది నువ్వు నీ తమ్ముడు కలిసి నా కూతురి జీవితాన్ని నాశనం చేశారని అంటాడు. అవని ఇప్పటికైనా నేను చెప్పేది వినండి మావయ్య అనేసి అంటుంది ఏం చెప్పాలి ఏం వినాలి అనేసి అరుస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని పార్వతి రాజేంద్రప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. భానుమతి ఏమైంది రాజేంద్రప్రసాద్ అప్పుడే వచ్చేసావ్ ఏంట్రా అనేసి అడుగుతుంది. పార్వతి ఆ గుడి దగ్గర అవని, ఆ భరత్ కనిపించారు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. పల్లవి కనిపిస్తే కొట్టడం కాదు చంపేయాలని అనిపిస్తుంది. వాడు చేసిన మోసానికి ప్రణతి జీవితం నాశనం అయ్యింది. అలాంటి వాడిని వదిలేయడం కాదు వాడి కాళ్లు చేతులు ఇరగ్గొట్టేలా పోలీసులకు అప్పజెప్పాలి అని పల్లవి అంటుంది. అందరిని నమ్మించి ప్లాన్ చేస్తుంది. పోలీసులను పంపించి ప్రణతిని ఇంటికి రప్పిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసుల్ని పంపించేస్తుంది ప్రణతి. నేను ఎందుకు వెళ్లాను నేను ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తున్నారు కదా నేను ఒక మేజర్ ని నా ఇష్టం వచ్చిన ప్రకారం నేను చేసుకోవచ్చు. ప్రేమించే హక్కు నాకుంది. అనగానే రాజేంద్రప్రసాద్ పార్వతి నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావని మాకు చెప్పాలి కదా అప్పుడే కదా మేము అర్థం చేసుకుని ఏం చేయాలో అది చేస్తాం అలాంటిది నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే మా పరువు పోలేదా అనేసి అడుగుతారు. చిన్న అన్నయ్య వదిన ప్రేమించుకున్న విషయాన్ని చెప్పారు. ఒప్పుకోలేదు సరి ఇంట్లోకి రానివ్వలేదు. నేను చెబితే ఒప్పుకుంటారా అని ప్రణతి అంటుంది.
అవని వదిన చెప్పిన నువ్వు ఒప్పించాల్సిన అవసరం లేదు నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకొనే హక్కు నాకుంది. అని ప్రణతి. నన్ను బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం నేను తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని ప్రణతి అంటుంది. నా ఇష్ట ప్రకారం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇందులో మీరు ఎవరు జోక్యం చేసుకోవాల్సిన విషయం లేదు నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతుంది బయట అవని చూసి నన్ను క్షమించు వదిన మీ మాట కాదని నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అంటుంటే బాధగా అనిపించింది అందుకే వచ్చానని ప్రణతి అంటుంది.
ప్రణతి మాటలు విన్నా ఇంట్ల వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక పల్లవి ప్రణతికి బాగా అవని ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్లు ఉంది అని మళ్లీ ఇంట్లో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. తర్వాత రోజు ఆరాధ్య పుట్టినరోజు కాబట్టి ఇంట్లో వేడుకలని గ్రాండ్గా చేయాలని అనుకుంటారు. కానీ ఆరాధ్యమాత్రం అమ్మ ఉంటేనే నేను బర్తడే చేసుకుంటానని అక్షయ్ తో అనడంతో అక్షయ్ వెళ్లి స్వయంగా అవనీని ఇంటికి తీసుకొని వస్తాడు.
అవని ఇంటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. నీ భార్య నువ్వు మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు జరిగిన విషయాల్ని మర్చిపోయావా ప్రణతికి ఎంత అన్యాయం చేసిందో నీకు గుర్తు లేదా? మళ్లీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అంటూ పార్వతి అక్షయ పై సీరియస్ అవుతుంది. ఇక పల్లవి కూడా అక్షయ్ బావ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అవని అక్కని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారని అసలు ఊహించలేదు ఇలాంటివి ఎందుకు చేశారు ఆమె చేసిన మోసం మీకు ఇంకో గుర్తు లేదా అనేసి అరుస్తుంది.
ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క మాట అంటుంటే అక్షయ్ మాత్రం ఈరోజు నా కూతురు పుట్టిన రోజు తన ఇష్ట ప్రకారమే నేను ఈరోజు చేస్తున్నాను కాసేపు అందరూ మౌనంగా ఉంటే మంచిది అని రిక్వెస్ట్ చేస్తాడు. అక్కడితో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని ప్రణతి గురించి నిజం చెప్తుందా లేదా చూడాలి..