IPL 2025 SCHEDULE : ఐపీఎల్ 2025 సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడుతుందని ఇటీవలే బీసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్-ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా పడ్డాయి. అలాగే పీఎస్ఎల్ కూడా వాయిదా పడింది. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలుగజేసుకొని భారత్-పాక్ శాంతియుతంగా వ్యవహరించాలని చెప్పడంతో యుద్ధం లేకుండా చర్చలకు సిద్ధమని రెండు దేశాలు ప్రకటించాయి. దీంతో ఐపీఎల్ త్వరలోనే ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది.
Also Read : Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !
మరోవైపు పాకిస్తాన్ మాత్రం భారత్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరైన సమాధానం చెబుతోంది. ఐపీఎల్ ను మే 15 నుంచి తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లను రప్పించాలని ఫ్రాంచైజీలకు చెప్పినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరో 12 లీగ్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటిలో అహ్మదాబాద్ 3, లక్నో, బెంగళూరు చెరో 2, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, ధర్మశాల తలో మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. అయితే భద్రత కోసం ధర్మశాల మ్యాచ్ ను మరో వేదికకు తరలించే అవకాశం ఉంది. మే 30న ఐపీఎల్ ఫైనల్ నిర్వహించనున్నట్టు సమాచారం. ఫైనల్ లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాల్పుల విరమణ అంగీకారంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి తెరపడింది. దీంతో ఐపీఎల్ (IPL) 2025 ను పునః ప్రారంభించే దిశగా బీసీసీఐ (BCCI) ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంగళవారం (మే 13)లోగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మినహా అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు తమ వేదికల్లో (హోం గ్రౌండ్లు) అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ను తిరిగి
ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ మౌఖికంగా తెలియజేసినట్లు సమాచారం. తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను తెలియజేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్రాంఛైజీలు తమ విదేశీ ప్లేయర్లను వెనక్కి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
మే 13 వరకు అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. మే 25నే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తోందట. మిగిలిన 12 లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో త్వరగా ముగించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కి తటస్థ వేదిక కేటాయిస్తారని భోగట్టా. అయితే, ఆ వేదికను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మే 15 లేదా 16న ఐపీఎల్ 2025 సీజన్ పున: ప్రారంభమయ్యే
ఛాన్స్ ఉంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉంటే.. మరోవైపు బెంగళూరు జట్టుకు షాక్ తగిలిందనే చెప్పాలి. కీలక బౌలర్ హెజెల్ వుడ్ గాయం కారణంగా ఆర్సీబీ కి దూరం కానున్నాడు. దీంతో ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.
IPL 2025 LIKELY SCHEDULE: 📢 (Express Sports).
Start – 16th May.
Final – 30th May.
Venues – Bangalore, Chennai & Hyderabad. pic.twitter.com/8M2jOSA4ml
— Tanuj (@ImTanujSingh) May 11, 2025