Rajinikanth Coolie..75 సంవత్సరాలకు చేరువలో ఉన్నా కూడా.. వరుస సినిమాలు ప్రకటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు రజినీకాంత్ (Rajinikanth). ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కూలీ (Coolie ). భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రేటు వచ్చేసింది. రజనీకాంత్, నాగార్జున (Nagarjuna), అమీర్ ఖాన్ (Aamir Khan) వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాకి ఓటీటీ హక్కుల రూపంలో దాదాపు రూ.120 కోట్లు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి.
భారీ ధరకు తెలుగు ఓటీటీ హక్కులు..
ఇదిలా ఉండగా మరొకవైపు..తెలుగు థియేటర్ హక్కులు రూ.45 కోట్ల మేర పలుకుతున్నాయి. ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఇకపోతే భారీ తారగణం నటిస్తున్నారు అంటే సినిమా నిర్మాణ వ్యయం కంటే వారి రెమ్యునరేషన్ కి ఎక్కువ ఖర్చు ఉంటుందని సమాచారం. పైగా ఈ సినిమా కూడా భారీ సినిమా కాబట్టి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. అయితే సన్ పిక్చర్స్ వారు బడ్జెట్ కోసం ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. భారీగానే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఓటీటీ హక్కుల రూపంలోనే రూ.120 కోట్లు అంటే మామూలు విషయం కాదని, సినీ వర్గాలు సైతం కామెంట్లు చేస్తున్నాయి.
కూలీ మూవీ విశేషాలు..
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ్ భాష యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతిహాసన్, రెబా మోనిక జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లేస్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 సెప్టెంబర్ లోనే ‘తలైవర్ 171’ అనే వర్కింగ్ టైటిల్ తో అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్, జైపూర్, విశాఖపట్నం, బ్యాంకాక్ వంటి ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ ఐమాక్స్ ఫార్మాట్లలో విడుదల కానున్న ఈ సినిమా లో.. రజనీకాంత్ దేవా అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు. హై యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Tagubothu Ramesh: లైవ్ లో వెక్కివెక్కి ఏడ్చిన తాగుబోతు రమేష్.. ఆమె వల్లే విరక్తి కలిగిందంటూ..?
రజనీకాంత్ సినిమాలు..
ఇక రజనీకాంత్ నుండి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar)దర్శకత్వంలో ‘జైలర్ 2’ సినిమా కూడా రాబోతోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘జైలర్’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది ఈ సినిమా. ఇంకా 75 సంవత్సరాల వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో రజనీకాంత్ అదరగొట్టగలరు అని నిరూపించింది. మొత్తానికైతే రజనీకాంత్ జైలర్ సినిమాతో మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు .ఇప్పుడు కూలీ, జైలర్ 2 సినిమా షూటింగ్లలో పార్లర్ గా పాల్గొంటూ ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు రజినీకాంత్.