Will O’Rourke: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( LSG vs RCB IPL 2025 Match 70) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్ వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో… క్వాలిఫైయర్ 1 లోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూసుకు వెళ్ళింది. దీంతో ఇవాళ క్వాలిఫైయర్ వన్ లో బెంగళూరు తలపడబోతోంది. అయితే లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో.. విలియం ఒరోర్కే పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
ALSO READ: Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!
ఆర్సిబికి అమ్ముడుపోయిన లక్నో బౌలర్ విలియం ఒరోర్కే
రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ నేపథ్యంలో… విలియం ఒరోర్కే పేరు మారుమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. విలియం ఒరోర్కే కారణం వల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టిందని… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీ వేసి మరి… అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన విలియం ఒరోర్కే ఏకంగా 74 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ 74 పరుగులు ఇవ్వడంతో… అతన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే ఫీలింగ్ మిస్ కూడా చేశాడు విలియం ఒరోర్కే. ఈ దెబ్బకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిందని కామెంట్స్ చేస్తున్నారు.
క్వాలిఫైయర్ వన్ లోకి దూసుకెళ్లిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో లీగ్ దశలో ఇది చివరి మ్యాచ్ కావడం గమనార్హం.. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే క్వాలిఫైయర్ వన్ లోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూసుకు వెళ్తుంది. ఇంకే ముంది దానికి తగ్గట్టుగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించారు.
లక్నో సూపర్ జెంట్స్ పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ విజయంతో క్వాలిఫైయర్ వన్ లోకి తీసుకువెళ్ళింది బెంగళూరు. ఇక క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో… పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore vs Punjab Kings ) మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. మే 29వ తేదీన… పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య… క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ చండీఘార్ వేదికగా నిర్వహించబోతున్నారు.
ALSO READ: Pant Mad Celebrations: రిషబ్ పంత్ సెంచరీ..గ్రౌండ్ లోనే సర్కస్.. గంగలో కలిసిన RCB ఆశలు